చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి


Thu,September 5, 2019 12:07 AM

vv vinayak launch ragala 24 gantallo telugu movie motion poster

ఇషారెబ్బా, సత్యదేవ్ జంటగా నటిస్తున్న చిత్రం రాగల 24 గంటల్లో. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నారు. వినాయకచవితిని పురస్కరించుకొని సోమవారం ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైటిల్ వినగానే చిన్నప్పుడు రేడియోలో విన్న వాయిస్, ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. శ్రీనివాసరెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు. మద్రాస్‌లో ఇమడలేక ఇండస్ట్రీని వదలివేయాలని అనుకున్న సమయంలో నాలో నమ్మకాన్ని నింపిన మంచి మిత్రుడు. ఈ సినిమా అతడికి చక్కటి పేరు తీసుకురావాలి అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. 24 గంటల్లో ఏం జరిగిందన్నది థ్రిల్‌ను పంచుతుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సినిమా సాగుతుంది అని తెలిపారు. నిర్మాతగా ఇదే తన మొదటి చిత్రమని, ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముందని శ్రీనివాస్ కానూరి పేర్కొన్నారు. శ్రీరామ్, గణేష్ రాఘవేంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అంజి.

522

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles