మీనాబజార్ కథ

Wed,October 2, 2019 12:05 AM

వైభవీజోషి, శ్రీజితాఘోష్, మధుసూదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మీనాబజార్. రానా సునీల్‌కుమార్‌సింగ్ దర్శకుడు. నాగేంద్రసింగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్మాత సి.కల్యాణ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే చిత్రసీమలో జరిగే సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తున్నది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి కథలతో రూపొందిన చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ కోవలో ఈ సినిమా నిలవాలి అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ కథాబలమున్న సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఓ దర్శకుడి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం అని తెలిపారు. సమాజంలో ప్రతినిత్యం జరిగే ఘటనల్ని స్ఫూర్తిగా చేసుకొని తెరకెక్కించిన చిత్రమిదని, కథ, పాత్రలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని హీరో మధుసూదన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

495

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles