పచ్చని కవితల నేల

Mon,August 12, 2019 01:26 AM

green-tree
బతుకు పచ్చని పొలాల్లా
ఆకులు రాలని వృక్షాలు
మెతుకు నిండిన చేతులు
పచ్చ బంగారం తీగలు కవితలై
అల్లుకోవడం పందిరి కావ్యాన్ని నేలని నింగి కలవడం
ఓ హరితగీతం కావొచ్చు
కానీ,
ఆ జగదృశ్యం నిజమైనవేళ
సుందరమైన కళగా
కనుల ముంగిట పచ్చదనం పిలుపు
పట్టుదల బిగిసిన పిడికిలిగా కదిలినడిస్తే
పదాలూ, పాదాలూ కురిసే స్వేదం
నదీ నదాలు ప్రవహించే నాద వేదం
శృతిలో కృషీవలం ఫలిస్తే చేతిలో పచ్చని ఆకు పంట
కృతిలో ఆకృతి గగన ప్రకృతి
గమ్యమైన విశ్వ విజయం
పచ్చని కవితల నేలలో పులకింత చేతులు పెంచిన చెట్టూచేమలదే..

-డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871

128
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles