ప్లాస్టిక్ వినియోగంతో అనర్థాలే

Sat,August 17, 2019 12:14 AM

ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. నదులు, సముద్రాలు కూడా కలుషితం అవుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ ప్రమాదాన్ని పసిగట్టి మేల్కొవాలి. లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థం అవుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉన్నది. ప్రకృతి విపత్తులు మన కండ్ల ముందటే కనిపిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. మనిషికి కావాల్సిన అన్నీ సౌకర్యాలను ప్రకృతి కల్పిస్తున్నది. దాన్ని భద్రంగా కాపాడాల్సిన బాధ్యత కూడా మనపై ఉన్నది. ప్లాస్టిక్ వినయోగం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి విస్తృతంగా అవగాహనా సదస్సులు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సమిష్టిగా ఈ కార్యక్రమాలను చేపట్టాలి. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి.
-పి. లక్ష్మణ్, హైదరాబాద్

అసత్య ఆరోపణలు సరికాదు

రైతులకు సాగు నీటి సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఏటా వందలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. దీని గురించి ఎన్నడూ ఆలోచించని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల గురించి అసత్య ఆరోణలు చేయడం సరికాదు. నిజంగా వారి హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే రైతుల కష్టాలు తీరేవి. వ్యవసాయ రంగం వృద్ధి చెందేది. కానీ ఆ పని చేయలేదు. కానీ ఉద్యమ సమయంలో రైతుల కష్టాలు స్వయంగా చూసిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సాగు నీటి కష్టాలను తీర్చడానికి కంకణం కట్టుకున్నారు. పక్కరాష్ర్టాలతో వివాదం లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇది చూసి గిట్టని వారే ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. నాణ్యమైన కరెంటు, సాగునీరు,తాగునీరు అందిస్తున్న ప్రభుత్వ పనితీరు పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి కొందరు ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా ప్రాజెక్టులపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలి.
-జి. రాజశేఖర్, వరంగల్

109
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles