మోదీ-షా ప్రైవేట్ లిమిటెడ్

Sat,August 17, 2019 11:54 PM

వాజపేయి మరణించిన ఏడాదిలోపు ఆగస్టు నెల లోనే తెలంగాణ ఆప్తురా లు సుష్మాస్వరాజ్ మరణించారు. దీం తో వాజపేయి చివరి అవశేషం కూడా అంతరించినట్లయింది. రాజకీయ ప్రయోజనాల కంటే దేశం గొప్పదని భావించే వాజపేయి ఆలోచనాసరళికి చెందినవారు ఆమె. విదేశాంగ మంత్రి గా మతభేదం లేకుండా భారతీయులందరికీ సమానదృష్టితో సేవలందిచా రు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అనేక అంతర్గత ఒత్తిడులను ఎదుర్కొని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడానికి కృషిచేశారు. అప్పుడు మోదీయే ప్రతిపక్ష నాయకునిగా ఉన్నట్లయితే తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఉండేదా అని బీజేపీ నాయకులే సందేహిస్తున్నారు. ఎందుకంటే ఆయన అనుసరించిన విధానాల వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది. 2014 ఎన్నికల్లో తల్లిని చంపి బిడ్డను విడదీశారని తన పార్టీ అనుసరించిన విధానం పైననే మండిపడ్డాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఏడు మండలాలను తెలంగాణ ప్రమేయం లేకుండానే తీసుకొని భద్రాద్రి రామున్ని అనాథను చేశాడు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను విస్మరించాడు. ఉన్నతాధికారులను కేటాయించడానికి సంవత్సరం కాలయాపన చేశాడు. రాష్ట్ర ప్రాజెక్టుల కు 24,000 కోట్లు ఇవ్వమని సాక్షాత్తు నీతి ఆయోగ్ చెప్పితే ఒక్క పైసా కేటాయించకుండా విగ్రహాలకు వేల కోట్లు, గుజరాత్ బుల్లెట్ రైలుకు లక్ష కోట్లకు పైగా కేటాయించుకున్నాడు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి భాజపా కాస్త మోదీ జనతా పార్టీగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ మోదీ-షా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందనే వాదన కూడా బలంగానే విన్పిస్తున్నది. మారిన పార్టీ విధానాలను గమనిస్తే.. ఈ వాదనే సహేతుకం అన్పిస్తున్నది. దశాబ్దాలు కష్టపడి పార్టీని నిర్మిస్తే ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ కంపెనీగా మార్చారు కదా అని వ్యవస్థాపకులు బాధపడుతున్నారు.

అభివృద్ధి పనులు చేయకున్నా కేవలం ప్రచారం ద్వారా ఎన్నికలలో గెలువవచ్చు అని ట్రంప్, నెతన్యాహు, మోదీలు నిరూపించారు. ట్రంప్ రోజుకు సగటున 19.7 అబద్ధాలు చెప్తున్నాడని వాషింగ్టన్ పోస్ట్ లెక్కగట్టింది. ఇప్పటికే 12 వేలకు పైగా అబద్ధాలను, తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు. దేశంలో సాహసం చెసి మోదీ అబద్ధాలను, హమీల ఉల్లంఘనలను లెక్కకట్టే పత్రికలు లేవు. వీరి దాడిలో మొదటి బాధితురాలు నిజం. ఇప్పుడు ఎన్నికలు.. నిజాలు, అబద్ధాలు (ప్రాపగాండ) మధ్యన జరుగుతున్నాయి. ప్రజల స్వల్పకాలిక జ్ఞాపకశక్తియే వీరికి అనుకూలమైన అంశం.


ఈ కంపెనీలో ఇద్దరే వాటాదారులు, మిగతావారంతా ఉద్యోగ భద్రతలేని నిమిత్తమాత్రులు! ఒక ప్రైవేట్ కంపెనీ పార్టీ మిగతా పార్టీలను కుటుంబ పార్టీలని నిందించడమే హాస్యాస్పదం. ఇక్కడొక సారూప్యత ఉన్నది. ఈస్టిండియా కంపెనీ 1612లో సూరత్ నుంచే దేశంలోకి ప్రవేశించి 200 ఏండ్లు దేశాన్ని పీడించింది. మోదీ-షాల మూలాలు కూడా గుజరాత్‌లోనే ఉన్నాయి. ఎన్నికలలో సహాయం చేసిన కార్పొరేట్లకు అన్నిరకాల సహాయాలు చేస్తున్నాడు. దొడ్డిదారిన పరిశ్రమలకు ఇచ్చిన ముప్ఫై లక్షల కోట్ల రుణాలు వసూలు చేయడానికి వీలులేనివిగా చేశాడు. బ్యాంకుల్లో డబ్బు కొరత తీర్చడానికి డీమానిటైజేషన్ తెచ్చి ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టి ప్రజల డబ్బును నిర్బంధంగా బ్యాంకులకు తరలించాడు. 50 రోజులలో డీమానిటైజేషన్ సత్ఫలితాన్నివ్వకపోతే ఉరి తియ్యమని సవాలు చేశా డు. ఫలితంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మోదీ పాలనలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడలేదు సరికదా యాభై లక్షల ఉద్యోగాలు పోయాయి. 2014లో చైనాకు 16.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగగా దిగుమతులు 58.4 బిలియన్లు. 2017లో 16.34 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగగా దిగుమతులు 68.10 బిలియన్లు. 300 మిలియన్ల ఎగుమతులు పెరిగితే 10 బిలియన్ల దిగుమతులు పెరిగాయి. మోదీ ఊదరగొట్టుతున్న ఉత్పత్తి ఏ రంగంలోనూ జరుగలేదు. ప్రపంచ జీడీపీ ర్యాకింగ్‌లలో దేశం 7వ ర్యాంక్‌కు పడిపోయింది. డాలర్ విలువ 62 రూపాయల నుంచి 72కు ఎగబాకింది. చైనా నుంచి దిగుమతులు తగ్గించామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ చైనా తెలివిగా హాంకాంగ్ మీదుగా ఇండియాకు ఎగుమతులు చేస్తూ వాస్తవాలను మరుగుపరుస్తున్నదని ఎకనామిక్ టైవ్‌‌సు ఓ కథనం ప్రచురించటం గమనార్హం. కశ్మీర్‌లో 370, 35ఏ తొలిగించడం ఎంత సబబో అనుసరించిన విధానం తర్వా త జరుగుతున్న ప్రచారం అంత అభ్యంతరకరం. మెజారిటీ ఉన్నప్పుడు రాజ్యాంగ నిబంధనలను పాటించి చేయవలసిన మార్పును పేరు రావాలని కక్కుర్తిపడి చేసినట్లుగా కన్పిస్తున్నది.

ఏ రాష్ర్టానైనా విడగొడ్తాం, ఆ రాష్ట్ర ప్రమేయం లేకుండా సరిహద్దులను మారుస్తామనే హెచ్చరిక కన్పిస్తున్నది. ఆక్రమిత కశ్మీర్‌లో ఒక్క అంగుళం భూమిని కూడా తేకుండా శత్రుదేశాన్ని జయించినంత భారీగా సంబురాలు జరుపుకోవడం ఆశ్చర్యకరం. చైనా పహారాలో ఉన్న సిక్కిం దేశాన్ని దేశంలో 22వ రాష్ట్రం గా నేర్పుగా కలిపినప్పుడు కూడా ఇందిరాగాంధీ ఇంతటి ప్రచారం చేసుకోలేదు. మోదీ, షాలు తెలంగాణలో పాగా వేయటానికి మతాన్ని వేదికగా ఎంచుకున్నారు. అసదుద్దీన్‌ను వెయ్యి తలల రాక్షసునిగా చూపించి కేసీఆర్ అసదుద్దీన్‌ల స్నేహం హిందు మత వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఈ ప్రచారం కొంతవరకు ప్రభావాన్ని చూపింది. అద్వానీ, జిన్నా సమాధిని సందర్శించి జిన్నాను పొగడగా, పిలువకుండానే పాక్‌కు వెళ్ళి నవాజ్ షరీఫ్ ముందు మోదీ సాగిలపడ్డాడు. 2014లో పాక్ గడ్డ మీద భారత ముస్లింల గురించి పాకిస్థానీయులు దిగులు చెందాల్సిన అవసరం లేదని, మీరు మీ దేశంలో ఉన్న తీవ్రవాదం గురించి ఆందోళన చెం దండని అసదుద్దీన్ చెప్పాడు. 1947లోనే మేం భారత్‌ను మాతృభూమిగా ఎంచుకున్నాం. న్యాయవ్యవస్థ గుజరాత్ అల్లర్ల దోషులను శిక్షిస్తున్నది. మా సమస్యలను మేము పరిష్కరించుకుంటాం మీ సమస్యలను మీరు చూసుకొండని కరాఖండిగా చెప్పిన అసదుద్దీన్‌ను జాతి వ్యతిరేకిగా చూపిస్తున్నారు. మజ్లిస్ పార్టీ సిద్ధాంతాలతో విభేదించేవారు కూడా ముస్లింలకు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం కలిగించడం లో ఆ పార్టీ నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్నదన్న విషయాన్ని విస్మరించలేరు. గమనించవలసిన విషయమేమంటే ఇంతవరకు మజ్లిస్ నాయకులెవ్వరు టెర్రరిజానికి సంబంధించిన గొడవలలో అరెస్టు కాలేదు. మక్కామసీద్ బాంబు పేలుళ్లలో అరెస్టయిన వారు ఎలా నిర్దోషులగా విడుదలయ్యారు? తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎందుకు రాజీనామా చేశాడు? అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నలే. బాబ్రీ మసీదు కూల్చివేతలో ప్రధాన సాక్షి అయిన రామమందిరం పూజారి బాబాలాల్ దాస్ హత్య ఇం కా మిస్టరీనే.

మైనారిటీలు, లౌకికవాదులు కేసీఆర్ విధానాలను ప్రశ్నించడానికి ఆస్కారం ఉన్నది. ఆధునిక భారతదేశంలో యజ్ఞయాగాల, పూజల ద్వారా నయా బ్రాహ్మణ వాదాన్ని పునరుద్ధరిస్తున్నాడని కొంత చర్చ జరుగుతున్నది. కానీ హిందుమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని పదవులు పొందే వారు కేసీఆర్ హిందు మత నిబద్ధత గురించి ప్రశ్నిస్తున్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హిందూ మతానికి ఇవ్వనంతటి ప్రాధాన్యం కేసీఆర్ ఇచ్చాడు. ప్రస్తుతం 14 రాష్ర్టాలలో బీజేపీ ప్రభుత్వా లు అధికారంలో ఉన్నాయి. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా 1,800 కోట్ల రూపాయలు మందిర నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించారా? కేసీఆర్ ఎక్కువగా యాగా లు చేస్తున్నాడని ప్రధాని మోదీయే ఆరోపించాడు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి గుడికి 1,800 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించింది. 2018-19 బడ్జెట్‌లో దేవాలయాల నిర్మాణం కోసం 550 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నాలుగింటికి హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టారు. 80 శాతం తెలంగాణ ప్రజల అవసరాల తీర్చే ప్రాజెక్టుకు కాళేశ్వరం అని, ఖమ్మంలో ఒక ప్రాజెక్టుకు సీతారామ అని, 25,000 కోట్లతో నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్‌కు యాదాద్రి అని నామకరణం చేశారు. నేపాల్ తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు తెలంగాణలోనే ఎక్కువగా కన్పిస్తాయి. ఇదంతా మతదృష్టితో కాదు, సంస్కృతికి పెద్దపీట వేయటంగా చూడాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి పనులు చేయకున్నా కేవలం ప్రచారం ద్వారా ఎన్నికలలో గెలువవచ్చు అని ట్రంప్, నెతన్యాహు, మోదీలు నిరూపించారు. ట్రంప్ రోజుకు సగటున 19.7 అబద్ధాలు చెప్తున్నాడని వాషింగ్టన్ పోస్ట్ లెక్కగట్టింది. ఇప్పటికే 12 వేలకు పైగా అబద్ధాలను, తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు. దేశంలో సాహసం చెసి మోదీ అబద్ధాలను, హమీల ఉల్లంఘనలను లెక్కకట్టే పత్రికలు లేవు. వీరి దాడిలో మొదటి బాధితురాలు నిజం. ఇప్పుడు ఎన్నికలు.. నిజాలు, అబద్ధాలు (ప్రాపగాండ) మధ్యన జరుగుతున్నాయి.
nagender-madavaram
ప్రజల స్వల్పకాలిక జ్ఞాపకశక్తియే వీరికి అనుకూలమైన అంశం. ప్రాపగాండతో మిథ్యా వాస్తవాలను సృష్టిస్తారు. ఆచార్య జయశంకర్ చెప్పినట్లు నిరంతర భావజాల వ్యాప్తిచేయడం, ప్రజలను చర్చలలో, నిర్ణయాలలో, అమలులో భాగస్వామ్యం చేయడం ద్వారా మాత్రమే కాలకేయుల ఆక్రమణలను నిలువరించ డం జరుగుతుంది. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ను ఆమోదింపచేశారు అని పార్లమెంట్‌లో అమిత్ షా చెప్పారు. తెలంగాణకు కేం ద్రం కేటాయించిన నిధులపై, తెలంగాణ ఏర్పాటుపై మోదీ-షా ద్వయం వెలిబుచ్చుతున్న అభిప్రాయాలపై గ్రామాలలో సమగ్రమైన చర్చ జరుగాలి. తెలంగాణ పట్ల బీజేపీ అగ్రనాయకత్వ ధోరణిని ఎండగట్టాలి. తెలంగాణ సంస్కృతి, విభిన్నత, స్వతంత్ర పరిరక్షణ కోసం తెలంగాణ సమాజం ప్రయత్నించాలి, పోరాడాలి.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్, డీసీ)

361
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles