ఆటల క్రీనీడల కథలు

Mon,August 19, 2019 03:02 AM

Kreedakatha
ఈ మధ్యకాలంలో ఒకే కథాంశం ఆధారంగా వచ్చిన కథాసంకలనాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. రచయిత సంపాదకు లు కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి మురళీమోహన్ కలిసి మరో సంకలనాన్ని పాఠకులకు అందించారు. అది క్రీడాకథ.. రైలు కథలు, దేశభక్తి కథలు అనంతరం ఇప్పుడొచ్చిన సంకలనం ఇది. ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని అన్వేషించే వారి ప్రయత్నంలో మరో మైలురాయి ఈ క్రీడా కథ. అయితే ఈసారి కథలను శీర్షికలతో వర్గీకరించారు వారు. శ్రీపాద వారి కథను ఎందుకు ఉపయోగించుకోలేకపోయా రో వివరించే ప్రయత్నం చేశారు. కథాస్ఫూర్తిని అనుసరించి నాంది, ప్రస్తావన, క్రీడాస్ఫూర్తి, మానసికం, వినోదం, ఉన్మా దం, నేరం అంటూ మరింతగా విభజించి కథలను క్లాసిఫై చేసే ప్రయత్నం చేశారు. అదొక ప్రయోగంగానే భావించాలి తప్ప తప్పనిసరి అవసరమైతే కాదు. ఈ విభజన వల్ల కథలను అవి ప్రచురింపబడిన సంవత్సరాల ఆధారంగా చూసే అవకాశం లేకుండాపోయిందేమో. ప్రధానంగా ఈ కథల్లో ఎక్కువగా కనిపించిన క్రీడలు క్రికెట్, చెస్, టెన్నిస్, ఫుట్‌బాల్, హాకీ లాంటివి. ఒకటీ, అరా.. ఆటలను ఏ దశలోనూ ప్రోత్సహించని తెలుగు సమాజంపై చురకతో ఈ సంకలనం మొదలవుతుంది. అది భూపాల్ కథ అదీ ఆటే. చిన్నపిల్లలకు ఏ అవకాశమూ లేనప్పుడు పెద్దవాళ్ళ చెప్పులేసుకొని అటూ ఇటూ నడుస్తుంటారు దాన్నో ఆటగా భావిస్తూ. అలాచేస్తున్న ఓ చిన్నపిల్లని విసుక్కొని లాక్కెళ్ళిపోతుంది తల్లి. బాల సాహితీవేత్త భూపాల్ ఉగ్గుపాలు నుంచి తీసుకున్నారు.

క్రీడల్లో ఉండే నేరపూరిత స్వభావం చూపే కథలు మూడున్నాయి. ఒకటి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది చదరంగంలో హత్య. ఆయన శైలి, ధోరణి అందిపుచ్చుకున్న కథ. 1972లో అపరాధ పరిశోధనలో వచ్చింది. అలాంటిదే మరో కథ కస్తూరి మురళీకృష్ణ గారి మర్డర్ కాని మర్డర్. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న కథ.


అలా మొదటి కథే మనలను అద్దంలో చూసుకొమ్మని హెచ్చరిస్తుంది. ఇక ప్రస్తావన శీర్షికన కవి కొండల వెంకట్రావు కథ చెడుగుడు-చెండాట అప్పటి గ్రామీణ పరిస్థితులను ప్రతిబింబించే కథ. అనంతరం క్రీడాస్ఫూర్తి శీర్షికతో నాలుగు కథలున్నాయి. అందులో మొదటిది చిలుకూరి దీవెన ఆటపట్టు కథ. క్రీడారంగంలోను దళితులకు అన్యాయం జరిగిందన్న పాయింట్‌ను ఎంచుకుంటారు రచయిత్రి. యువ కథకురా లు అయాచితం స్పందన కథ ఆమె గెలిచింది కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఒక ఆడపిల్ల ధైర్యంగా అమ్మానాన్నలను ఎదిరించి క్రీడల్లో పాల్గొనటం అన్న అంశం తీసుకున్నందుకు అభినందించాలి. హార్దిక గారి కథ తాయ్ చి మాస్టర్ సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించటానికి తాయ్ చి అనే క్రీడ ను ఆలంబన చేసుకున్న ఓ వ్యక్తి కథ. నిడివి ఎక్కువున్నా బౌద్ధ చైనీస్ సంప్రదాయాలను కలబోసుకున్న ఈ కథలో చదివించే గుణం మనలను పరిగెత్తిస్తుంది. ఒక క్రీడకు ఉండే లోతైన శక్తిని వివరించే ప్రయత్నం చేస్తుంది. చెడుపై మంచి పోరాటం సినిమాటిక్‌గా సాగి పాఠకులను అలరిస్తుంది. ఎక్కువ శాతం క్రీడా కథలన్నీ క్రీడలకు మనిషి మనసత్త్వానికి ఉండే సంబంధాన్ని పోల్చిచూపేవే. కొన్ని కథలు ఉత్తమస్థాయిలో ఉండి పాఠకుడిని వెంటాడుతాయి. చెస్ ఆటపై వచ్చిన శ్యామల గారి చదరంగం, సి.రామచంద్రరావు గారి టెన్నిస్ టోర్నమెంట్ కథలు ఆ కోవకు చెందుతాయి. క్రీడలొక obsessionగా మారిన వారిని చూపుతాయీ కథ లు. చదరంగం ఆట మోజులో ఇల్లాలిని పట్టించుకోని భర్తను ఆ ఇల్లాలు ఎలా వదిలించుకొని తనదారి తను వెతుక్కుందో చెప్పే కథ. శ్యామల గారి రచన కథాకాలం 1977.

అదే సి. రామచంద్రరావుగారి టెన్నిస్ టోర్నమెంట్ కథలో కూడా ఇలాంటి లక్షణాలున్న భర్త పాత్రను చూస్తాం. యామిజాల పద్మనాభస్వామి గారి తోసిరాజు పాఠకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది కూడా చెస్ నేపథ్యంలో నడిచే కథే. కానీ ఇక్కడ కూడా కథ నడిచిన తీరు పాఠకుడిని కథ నుంచి దృష్టిని మరల్చనివ్వదు. విజయనగరం రాజావారు కూరెళ్ళ శాస్ర్తులు గారు మధ్య నడిచిన చదరంగపు ఎత్తులు, పై ఎత్తులను శిల్పాసౌందర్యంతో నింపే కథ. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అనేది ఎలా జరుగుతుం దో సుతిమెత్తగా చెబుతుందీ కథ. ఇక యండమూరి వీరేంద్రనాథ్ గారి టాస్ కథ. క్రికెట్ నేపథ్యంగా వచ్చిన కథ. సునీల్ గవాస్కర్‌తో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగిన ఒక తెలుగువాడిని పాత్రచేసిన కథ. ఎనభైల నాటి ప్లేయర్లు గవాస్కర్, విశ్వనాథ్, ఆండీ రాబర్ట్స్, హోల్డింగ్ వంటి వారిమధ్య ఒక కొత్తప్లేయర్ ఆడినప్పుడు చెలరేగే భావోద్వేగాలను చెబుతుంది. దానికో లవ్ యాంగిల్ చేర్చటంతో కథ క్రికెట్ మ్యాచ్‌లా ఉద్వేగంగా సాగుతుంది. ఇది 1981లో వచ్చిన కథ. 1980లో భారత్‌లో పర్యటించిన వెస్టిండీస్ జట్టు కథా నేపథ్యమైంది. పెద్దిరాజు జంపన కథ కూడా మనలోని ఉద్వేగాలను కలియబెట్టి తిప్పుతుంది. కథ పేరు ఫౌల్ ఫౌల్. టెన్నిస్ ప్లేయర్ కు నీరాజనాలు పట్టే నగరం టెన్నిస్ కోర్టును తయారుచేసే కూలీ అనారోగ్యంతో మరణిస్తే నిర్దయపూరిత నగరాన్ని తట్టుకోలేని క్రీడాకారిణి వ్యథ. మనపై రచయిత తన కోపా న్ని చాలా దుఃఖ భరితంగా ప్రకటిస్తాడు. మొత్తం వ్యవస్థను పరిహసిస్తాడు. ఫేడవుట్ అయిపోయే క్రీడాకారులు అంత తొందరగా ఆ విషయాన్ని గుర్తించరు. అది తెలిసినప్పుడు వేదాంతిలా మారిపోతారు. ఒంటరితనం ఆవరించి బేలగా మారిపోతా రు. అలాంటి కథ యర్రంశెట్టి సాయి అవుట్‌కథ. ఈకథను నిర్మించిన తీరుకు పాఠకుడు కథలో లీనం అవకతప్పదు.

ఇక క్రీడల్లో ఉండే నేరపూరిత స్వభావం చూపే కథలు మూడున్నాయి. ఒకటి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది చదరంగంలో హత్య. ఆయన శైలి, ధోరణి అందిపుచ్చుకున్న కథ. 1972లో అపరాధ పరిశోధనలో వచ్చింది. అలాంటిదే మరో కథ కస్తూరి మురళీకృష్ణ గారి మర్డర్ కాని మర్డర్. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న కథ. చివరిగా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన కథ దామా గోవిందరావు గారి నా ఒలింపిక్ కల. ఫుట్‌బాల్ నేపథ్యంలో సాగే కథ. చివరికి హిట్లర్‌తో వాదించే యువ బృందం కలను కథ గా తెలియజెప్పే కథ. హాస్యభరితంగా సాగే ఈ కథ 1935 లో వచ్చింది. ఈ కథాసంకలనంలో చాగంటి తులసి, వసుంధర, ఎన్. ఆర్.చందూర్ వంటి లబ్ధ ప్రతిష్ఠుల కథలు కూడా ఉన్నాయి. అలాగే సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్‌ల కృషి అభినందించదగినది.
- సి.యస్.రాంబాబు, 94904 01005

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles