విద్వేష రాజకీయాలు ఇక్కడ చెల్లవు

Mon,August 19, 2019 11:55 PM

బీజేపీ జాతీయ నేతలు ఢిల్లీలో ఒకరకంగా, హైదరాబాద్‌లో ఒకరకంగా మాట్లాడటం పరిపాటిగా మారింది. రాజకీయ లబ్ధి కోసం అసత్యాలు మాట్లాడటం అలవాటైంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతిఆయోగ్ ప్రశంసించింది. దానికి నిధులు కూడా ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కూడా అనేకసార్లు ప్రధాని సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి కూడా రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల తగిన నిధులు ఇవ్వాలని వినతి పత్రాలు అందించారు. అయినా కేంద్రంలోని పెద్దలు అప్పుడు సానుకూలంగా స్పందించడం తర్వాత బుట్టదాఖలు చేయడం గడిచిన ఐదేండ్ల కాలంలో జరుగుతున్నది. కానీ బీజేపీ జాతీయ నాయకులకు ఇవన్నీ తెలిసినా రాష్ట్ర నాయకులు రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. ప్రాధాన్య అంశాల వారీగా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనా అందరూ అంటున్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందాయి.

వివిధ రాష్ర్టాలు అభినందిస్తూ వాటిని ఆయా రాష్ర్టాల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కానీ బీజేపీ జాతీయ,రాష్ట్ర నాయకులకు ఇవి కనిపించకపోవడం, వీటిపై ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేయడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాలు సంతోషంగా ఉంటున్నారు. కానీ బీజేపీ నేతలు మతం పేరుతో ఇక్కడ సంక్షోభం సృష్టించి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్నట్టు ఉన్నది. కానీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్రం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేశారు. అనేక త్యాగాలు చేశారు. ఇక్కడి ప్రజల చైతన్యం వల్లనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొ ట్టే వారిని ఎక్కడ ఉంచాలో వారికి తెలుసు. తెలంగాణ కొత్త రాష్ర్టామైనా కేంద్రం సహకారం అంతంత మాత్రమే ఉన్నా అభివృద్ధిలో దేశంలోని అగ్రభాగ నిలుస్తున్నది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడి ప్రాజెక్టులను ఆద ర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నేతలు ఈ వాస్తవాన్ని గ్రహించి రాష్ర్టాభివృద్ధి కోసం తమ వంతు సహాయం చేసి ప్రజల మన్ననలు పొందాలి. అంతేగానీ అసత్యాలతో అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు.
- జి. భానుప్రసాద్, హైదరాబాద్

137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles