అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

Wed,August 21, 2019 10:54 PM

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు ఇది వాస్తవమే కూడా. అంతకుముందు వరకు పైచేయిగా ఉండిన భావజాలం విఫలమై శూన్యం ఏర్పడినపుడు అం దు లోకి మరొక భావ జాలం ప్రవేశించటం సహజం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసిన ధర్మసూక్ష్మం ఒకటున్నది. అంతకు ముందువరకు పై చేయిగా ఉండిన భావజాలం విఫలం కావటానికి కారణమేమిటి? యథాతథంగా ఆ భావజాలమే విఫలమైందా లేక దానిని అమలుపరు చటంలో నాయకత్వ వైఫల్యం కారణంగా అట్లా జరిగిందా? ఈ ప్రశ్నల ను అర్థం చేసుకుంటే తప్ప మనకు పరిస్థితి సరిగా అర్థం కాదు. శూన్యం ఎందుకు ఏర్పడిందో, అందులోకి ఒక కొత్త భావజాలం ఎందుకు ప్రవేశి స్తున్నదో బోధపడదు. ఒకసారి దీనినంతా గ్రహించినట్లయితే, అపుడు సూత్రరీత్యా ఈ దేశా నికి, సమాజానికి ఏది తగిన భావజాలమో, నాయకత్వాల వైఫల్యం వల్ల ఆ భావజాలం ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, తాత్కాలికంగా మరొక భావజాలానిది పైచేయి అయినప్పటికీ, అంతిమంగా ఏది మన సమా జం ఎంచుకోదగిన భావజాలమో తెలియవస్తుంది. దీన్నిబట్టి, అదేవి ధంగా మన దేశంలో మొదటి నుంచి గల జాతీయ, ప్రాంతీయ పార్టీల ను, వాటి సిద్ధాంతాలను, పరిపాలనలను, సాఫల్య వైఫల్యాలను, ఎన్ని కల్లో గెలుపోటములను విశ్లేషించిన మీదట తేలుతున్నది ఒకటున్నది. అది, ఎవరి అధికారానికి అయినా అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధి, సంక్షే మం, సామాజిక న్యాయమే. అయితే ఇక్కడ ఒక వివరణ అవసరం. మనకు 1947లో స్వాతంత్య్రం లభించి, 1952లో మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి సుమారు 15 ఏండ్లు లేదా మూడు ఎన్నికల పాటు అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలే సాధారణ ప్రజలకు విచార ణాంశాలుగా ఉండేవి. సామాజిక న్యాయం అనే మూడవ అంశం ఎస్సీ, ఎస్టీలకు పరిమితమై ఉండేది.

మనం వర్తమానంలో చూస్తున్న రాజకీయ దృశ్యాలు అన్నింటికీ వర్తించే సూత్రం ఒకటున్నది. అధికారంలో ఉన్నది ఒక జాతీయపార్టీ లేదా ప్రాంతీయపార్టీ కావచ్చు. దాని సిద్ధాంతం ఏదైనా కావచ్చు. వారి అధికారానికి అంతిమ శ్రీరామరక్ష మాత్రం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే. ఆ సూత్రాన్ని సవ్యంగా పాటించినంత కాలం ఏ ప్రమాదమూ వాటిల్లదు. ఏవైనా అసాధారణ పరిణామాలు సంభవిస్తే తప్ప. దేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన జాతీయ, ప్రాంతీయ ఎన్నికల ఫలితాలు అన్నింటికి ఇవే సూత్రాలు వర్తిస్తూ వచ్చాయి. ఇకముందూ ఇదే జరుగుతుంది.


వారికి రిజర్వేషన్లు, కొన్నిరకాల రక్షణలు కల్పించినందున సామాజికన్యాయం లభించిందనే భావన ఉండేది. ఆ దశలో అంతటితో సంతృప్తి చెందినట్లు కనిపించిన ఆ వర్గాలు కూడా కాలం గడిచినా కొద్దీ, తమకు రిజర్వేషన్లు సరిగా అమలుకావడం లేదని, అట్లాగే ఇతరత్రా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక రక్షణ లభించటం లేదని అసంతృప్తి చెందసాగాయి. ఆ విధంగా స్వాతంత్య్రానంతరం రెం డు దశాబ్దాలు గడిచేసరికి ఎస్సీ, ఎస్టీలు ఒకవైపు, ఆ వర్గాలకు చెందని ఇతర బడుగుజీవులు మరొకవైపు అసంతృప్తికి గురికాసాగారు. అది తీవ్ర రూపం దాల్చటం కూడా మొదలైంది. ఆ విధంగా తర్వాత కాలంలో సామాజిక న్యాయం, సాధికారత అనే భావనలు బడుగు, బలహీనవర్గా లన్నింటికి సార్వత్రికంగా మారాయి. ఆ విధంగా అసంతృప్తి తీవ్రరూపం దాల్చటం దేశ రాజకీయ రంగం లో కేంద్ర స్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో కూడా పెద్దపెద్ద శూన్యాలను సృష్టించసాగింది. దానితో, అప్పటివరకు ఉండిన పార్టీలు ఓడిపోవటం, ఆ శూన్యాల్లోకి ఇతర భావజాలాలతో వేరే పార్టీలు ప్రవేశించటం మొద లైంది. వాస్తవానికి పెద్దపెద్ద శూన్యాలు ఏర్పడటం రెండు దశాబ్దాల తర్వా త మొదలైనా, అసలు అసంతృప్తి అంటూ తలెత్తి చిన్నచిన్న శూన్యాలు రావటం 1957 నాటి రెండవ ఎన్నికల సమయానికే కన్పించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారాన్ని కోల్పోవటంతో పాటు ఉత్త రప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా వంటి ప్రధాన రాష్ర్టాలలో 1952 తో పోల్చినపుడు ఓట్లు, సీట్లు పోగొట్టుకున్నది. ఆ పరిస్థితిని గమనించిన నెహ్రూ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను విస్మరిస్తే వారు మనను తోసివేసి ముందుకు పోగలరని హెచ్చరించారు. ఆయన మాటలు సరిగా ఇవే కాకపోయినా సారాంశం ఇదే. నెహ్రూ ఎంత అభ్యుదయవాది అయినా అపుడు కాం గ్రెస్ పార్టీలో ప్రాబల్యం ఫ్యూడల్ శక్తులది అయినందున తన హెచ్చరిక లు పనిచేయలేదు. 1957 తర్వాత మరొక పదేండ్లు గడిచేసరికి వైఫ ల్యాలు మరింత పెరిగి, శూన్యం కూడా మరింత పెరిగి, అందులోకి ఇత ర భావజాలాల శక్తులు ప్రవేశించటం వేగాన్ని పుంజుకున్నది.

సిద్ధాంతరీత్యా చూసినపుడు కాంగ్రెస్ వంటి మధ్యేమార్గ పార్టీలు అన్నివర్గాలను కలుపుకొనిపోయి, అందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూ, అభి వృద్ధి-సంక్షేమం-సామాజిక న్యాయాల సమన్వయ వేదికలుగా (అంబరెల్లా పార్టీ) తమనుతాము చెప్పుకున్నాయి. తక్కినవాటిలో అనేకం అభి వృద్ధి గురించి, సంక్షేమం గురించి సాధారణ రూపంలో మాట్లాడుతూనే, నిర్దిష్ట సామాజికవర్గాలకు సామాజిక న్యాయం లేదా రాజకీయాధికారం తమ లక్ష్యమన్నాయి. ప్రాంతీయపార్టీలు ప్రాంతీయ ఆర్థిక-రాజకీయ-సామాజికశక్తుల కోసం అధికారాన్ని సాధించటంతో పాటు అభివృద్ధి, సంక్షేమం తమ అజెండాలన్నాయి.


ఈ పరిస్థి తిని మరొకవిధంగా చెప్పాలంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన స్వాతం త్య్రోద్యమ కాలపు అభివృద్ధి, సంక్షేమ, సామాజిక న్యాయం లక్ష్యాలకు తు.చ తప్పకుండా కట్టుబడి పాలించినట్లయితే, రాజ్యాంగాన్ని, చట్టాల ను, బడ్జెట్లను, పంచవర్ష ప్రణాళికలను సవ్యంగా అనుసరించి ఉంటే, అసలు శూన్యాలు తలెత్తటం గాని, వాటిలోకి ఇతర భావజాల శక్తులు ప్రవేశించటం గాని జరిగేది కాదు. ఈ కథాక్రమం అంతా తదనంతర కాలంలో కాంగ్రెస్‌తో పాటు మొత్తం అన్ని పార్టీలకు, వాటి విభిన్న భావజాలాలకు, వాటి ప్రభుత్వా లకు, వాటి పరిపాలనలకు, సాఫల్య వైఫల్యాలకు వర్తిస్తూ పోయింది. ఇందులో కాంగ్రెస్ వంటి మధ్యేవాదులు, బీజేపీ వంటి మితవాదులు, కమ్యూనిస్టుల వంటి అతివాదులు ఉన్నారు. వారితో పాటు వృత్తులు, కులాలు, మతాలు, ప్రాంతీయశక్తుల పార్టీలు ఉన్నాయి. సిద్ధాంతరీత్యా చూసినపుడు కాంగ్రెస్ వంటి మధ్యేమార్గ పార్టీలు అన్ని వర్గాలను కలుపుకొనిపోయి, అందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూ, అభి వృద్ధి-సంక్షేమం-సామాజిక న్యాయాల సమన్వయ వేదికలుగా (అంబ రెల్లా పార్టీ) తమనుతాము చెప్పుకున్నాయి. తక్కినవాటిలో అనేకం అభి వృద్ధి గురించి, సంక్షేమం గురించి సాధారణ రూపంలో మాట్లాడుతూనే, నిర్దిష్ట సామాజికవర్గాలకు సామాజిక న్యాయం లేదా రాజకీయాధికారం తమ లక్ష్యమన్నాయి. ప్రాంతీయపార్టీలు ప్రాంతీయ ఆర్థిక-రాజకీయ-సామాజికశక్తుల కోసం అధికారాన్ని సాధించటంతో పాటు అభివృద్ధి, సంక్షేమం తమ అజెండాలన్నాయి. కానీ గత సుమారు 70 ఏండ్ల చరిత్రను గమనిస్తే, పార్టీలేవైనా, సిద్ధాంతాలేవైనా, ఎవరికి వారు తమకోసం అధికార సాధన పట్ల చూపిన శ్రద్ధ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయాల పట్ల చూపలేదు. అం దువల్లనే శూన్యాలు ఏర్పడి, వాటిలోకి మరొకరు ప్రవేశించటం జరుగు తూ వస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలు జాతీయస్థాయిలో, రాష్ర్టాలలో గెలువటం, ఓడటం అనేకసార్లు జరిగింది. అదేవిధంగా రకరకాలైన ఇతర పార్టీలు.
t-Ashok
గమనించదగినదేమంటే, అభివృద్ధి మాటను అట్లుంచి, ప్రత్యే కంగా సంక్షేమం, సామాజిక న్యాయం తాము పూర్తిగా కట్టుబడిన లక్ష్యా లని చెప్పుకున్న పార్టీలు సైతం కనీసం ఆ రంగాలలోనైనా సఫలం కాలేక, తమవారు అని ప్రకటించుకున్న వర్గాలకు సైతం తగు న్యాయం చేయలే క విఫలమై శూన్యాన్ని సృష్టించాయి. ఓడిపోయాయి. ఆ శూన్యంలోకి ప్రవేశించినవారు సైతం తిరిగి అవే వైఫల్యాలతో తాముకూడా ఓడిపో యారు. ఇందుకు గత 70 ఏండ్లలో మధ్యేమార్గ-అతివాద-మితవాద-అస్తిత్వవాద-సామాజికన్యాయవాద పార్టీలు అన్నింటిలో ఏదీ మినహా యింపు కాలేదు. ఇదంతా భారత రాజకీయాల్లో సాధారణ పరిస్థితులలో సాధారణ రూపంలో జరుగుతూ వస్తున్న చరిత్ర. పైన ప్రస్తావించినట్లు అసాధారణ పరిస్థితులు ఏవైనా, ఎపుడైనా ఏర్పడి భిన్నమైన ఫలితాలు రావటం వేరు. ఉదాహరణకు తూర్పు పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చటం, ఇంది రాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యలు, రథయాత్ర అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత, పాకిస్థాన్‌పై సర్జికల్ దాడుల వంటివి. ఇటువంటివి ప్రజల్లో భావోద్వేగాలను సృష్టించి ఒక తాత్కాలిక వాతావరణాన్ని కల్పించేవి గనుక లెక్కించదగినవి కావు. ఇటువంటి ఘటనలు ఒకోసారి అనుకో కుండా జరుగవచ్చు, ఒకోసారి ఎన్నికల కోసం ఉద్దేశపూర్వకంగా జరు పవచ్చు. అయినా అవి కృత్రిమమైనవి, తాత్కాలికమైనవి. నికరమైన రీతిలో, దీర్ఘకాలికంగా, దేశం మేలును, సమాజపు బాగు ను కోరే పార్టీలు చేయవలసింది మాత్రం అభివృద్ధి, సంక్షేమం, సామా జిక న్యాయం అనే మూడు లక్ష్యాలనూ తమ ఎదుట ఉంచుకొని, వాటి సాధనకు త్రికరణశుద్ధిగా కృషిచేయటం. ఆ పార్టీల అధికారానికి అదే అం తిమ శ్రీరామరక్ష అవుతుంది. వారు ఆ మార్గంలో చిత్తశుద్ధితో, సమర్థ వంతంగా సాగినపుడు శూన్యం ఏర్పడటమన్నది ఉండనే ఉండదు. ప్రస్తుతం మనం చూస్తున్న రాజకీయ అట్టహాసాల వంటివి ఏ శక్తులు ఏమిచేసినా వాటికి ప్రవేశమన్నది ప్రజలు కల్పించరు.

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles