మక్కజొన్నలో చీడపీడల యాజమాన్యం

Thu,August 22, 2019 01:19 AM

CornHeight
రాష్ట్రంలో ప్రస్తుతం మక్కజొన్న సాగులో అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి గడ్డిపల్లి కేవీకే విశ్రాంత శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వివరించారు. ఈ పంట సాగులో అదనపు సమాచారం కోసం 9440481279 నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ పంట సాగు గురించి ఆయన అందించిన వివరాలు..

- వానకాలం పంటగా జూన్‌15 నుంచి జూలై 15 వరకు విత్తిన మక్కజొన్న పంట పూతకు వచ్చే దశలో ఉన్నది. ఈ దశలో సిఫారసు చేసిన నత్రజని మోతాదు 24-32 కిలోలు ఎకరాకు పంట కు వేయాలి.
- వానకాలం పంటను వర్షాధారంగా సాగు చేసిన మక్కజొన్నకు నీరు ఉన్నచోట బెట్ట పరిస్థితులను బట్టి నీటితడులు ఇవ్వాలి.
- మోకాలి ఎత్తు దశ, పూతకు వచ్చే సమయం, గింజ నిండుకునే సమయంలో బెట్ట పరిస్థితులకు గురికాకుంటే వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు పొందవచ్చు.
- పూతదశలో నీటి ఎద్దడి లేకుండా ఉన్నైట్లెతే కాండం కుళ్ళును నియంత్రించవచ్చు.
- ఆకు ఎండు తెగులును అదుపు చేయడానికి 2.5 గ్రాములు మాంకోజెబ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికా రీ చేయాలి.
- పాముపొడ తెగులును నియంత్రించడానికి ప్రాపికొనజోల్‌ 1 గ్రాము లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి
- భూసారపరీక్షలకు అనుగుణంగా ఎరువులు వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగిన తేమ ఉండాలి.
- మక్కజొన్నలో పోషక సమస్యలు పూత దశలో, పిందె దశలో ఏర్పడితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.
- మక్కజొన్నలో జింక్‌, ఇనుము, మాంగనీస్‌, బోరాన్‌ లోపం బాగా కనిపిస్తాయి. ఈ లోపాల నివారణకు సిఫారసు చేసిన మోతాదులో సూక్ష్మపోషకాలు పూతకు పది రోజల ముందు నుంచి మొదలుకుని 20-25 రోజుల వరకు వాడి నివారించి అధిక దిగుబడులను పొందవచ్చు.
- ఈ మధ్యకాలంలో మక్కజొన్నలో లద్దె పురుగు జాతికి చెందినది పంటను ఆశించి నష్టపరుస్తు న్నది. దీని నివారణకు సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, రసాయన పురుగుమందు అయిన క్లోరోనైట్రిపోల్‌ 0.3 మి.లీ.లు లీటర్‌ నీటికి ప్లూ బెండిమైడ్‌ 0.3 మి.లీ.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నోవాల్యురాన్‌ 0.75 మి.లీ.లు లీటర్‌ నీటికి+ డైక్లోరోవాస్‌ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు

- నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

174
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles