చిదంబరంపై దర్యాప్తు

Fri,August 23, 2019 12:52 AM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్టు ఉదంతం బుధవారం నాడంతా ఉత్కంఠను రేకెత్తించింది. దర్యాప్తు సంస్థలు వెతుకున్నట్టుగా, ఆయన తప్పించుకున్నట్టుగా మీడియాలో ప్రచా రం సాగింది. అయితే కేంద్ర మాజీ హోంమంత్రి అయిన చిదంబరం చట్టానికి చిక్కకుండా తప్పించుకుపోతారా అనేది చాలామందికి నమ్మలేని విషయం. రాత్రివేళ చిదంబరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటుచేసి తన వాదన వినిపించడమే కాకుండా న్యాయవాదులతో చర్చలు జరుపడంలో నిమగ్నమై ఉన్నానని వెల్లడించారు. ఆయన తన నివాసానికి వెళ్ళిన తరువాత దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ముందస్తు బెయిల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందడానికి రోజంతా ప్రయత్నించారనేది వాస్తవం. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్నవారు ఆర్థిక నేరస్థుల మాదిరిగా తప్పించుకుపోవడం సాధారణంగా జరుగదు. రాజకీయనాయకులు అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధపడుతరు. ప్రముఖ ప్రతిపక్ష నాయకుడైన చిదంబరంపై కేసులు పెట్టి దర్యాప్తు సాగించడం వివాదాన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నది. తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఏ కేసులోనూ నిందితులు కాదనీ, ఈడీ లేదా సీబీఐ తమపై చార్జిషీటు, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదని చిదంబరం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు చిదంబరం అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం రాజకీయ వేధింపులకు దిగుతున్నదని ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటం వల్లనే ఆయనను వేధిస్తున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. చిదంబరానికి మద్దతు ఇచ్చి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

దేశంలో రాజకీయ అవినీతి తీవ్రస్థాయిలో ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే రీతిలో ఈ అవినీతి పెరిగిపోవడం ఆందోళనకరం. అయితే ప్రజలకు అవినీతి పట్ల ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతను రాజకీయ ప్రయోజనాల కోసం సొమ్ము చేసుకోవడం మరింత పతనాన్నే సూచిస్తున్నది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అవినీతిపై పోరాటం సాగడం లేదు. అవినీతిపై పోరాటం పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలు సాగుతున్నాయి. నాడు కాంగ్రెస్ పార్టీపై ఇవే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విమర్శ అదే. యూపీఏ రెండవ విడత అనేక అవినీతి ఆరోపణలకు గురైంది. ఈ నేపథ్యంలో అవినీతిని నిర్మూలిస్తామనే ప్రచారంతో మోదీ అధికారానికి వచ్చారు.


ఐఎన్‌ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడుల పెంపుదల బోర్డు (ఎఫ్‌ఐపీబీ) 4.62 కోట్ల రూపాయలు మాత్రమే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడానికి 2007 మార్చిలో అనుమతిచ్చింది. కానీ ఈ సంస్థ 305 కోట్ల మేర పెట్టుబడులు తెచ్చుకున్నది. సంబంధిత అనుమతులు లేకుండా ఈ నిధులను మరో సంస్థ ఐఎన్‌ఎక్స్ న్యూస్‌కు బదిలీ చేసింది. దీనిపై 2008 లోనే దర్యాప్తు మొదలైంది. అయితే మోదీ మొద టి పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు చిదంబరం మెడకు కూడా చుట్టుకున్నది. ఐఎన్‌ఎక్స్ మీడియా అక్రమాలకు పాల్పడిన కాలంలో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఐఎన్‌ఎక్స్ సంస్థ ఈ కేసు నుంచి బయటపడటానికి చిదంబరం కుమారుడికి లబ్ధి చేకూర్చిందని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలు తం డ్రీకొడుకులపై దర్యాప్తు ప్రారంభించాయి. చిదంబరం మద్దతుదారులు కొందరు వినిపిస్తున్న వాదన ప్రకారం ఆయన మీద బలమైన ఆరోపణలేవీ లేవు. చిదంబరం అరెసు కు దర్యాప్తు సం స్థలు చెబుతున్న కీలక ఆధారం ఒకప్పుడు ఐఎన్‌ఎక్స్ మీడియా అధినేతగా వెలిగిపోయిన ఇం ద్రాణి ముఖర్జీ సాక్ష్యం! ఆమె జీవితాన్ని, ఆమెపై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తే ఏ మాత్రం విలువలు పాటించినట్టుగా కనిపించదు. తన మొదటి సంబంధం బిడ్డను హత్యచేసి తగుల బెట్టిన కేసులో ఇంద్రాణి ముఖర్జీ నిందితురాలు. ఆమె ఇప్పు డు జైలులోనే ఉన్నారు. విదేశీ మారకం నిర్వహణ కేసులోనూ తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఆమెను అప్రూవర్ అంటూ చిదంబరానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడం కష్టం కాదనే వాదన ఉన్నది.

దేశంలో రాజకీయ అవినీతి తీవ్రస్థాయిలో ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే రీతిలో ఈ అవినీతి పెరిగిపోవడం ఆందోళనకరం. అయితే ప్రజలకు అవినీతి పట్ల ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మరింత పతనాన్నే సూచిస్తున్నది. కేం ద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అవినీతిపై పోరాటం సాగడం లేదు. అవినీతిపై పోరాటం పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాడు కాంగ్రెస్ పార్టీపై ఇవే విమర్శ లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విమర్శ అదే. యూపీఏ రెండవ విడత అనేక అవినీతి ఆరోపణలకు గురైంది. ఈ నేపథ్యంలో అవినీతిని నిర్మూలిస్తామనే ప్రచారంతో మోదీ అధికారానికి వచ్చారు. విదేశాలలోని నల్లడబ్బును తెప్పిస్తానని అన్నారు. కానీ మొదటి విడుత పాలన లో ఇదేదీ జరుగకపోగా, అవినీతిపరులు దర్జాగా దేశం విడిచిపెట్టి పోయిన ఉదంతాలున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి కేసులు రాజకీయంగా ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగపడుతున్నాయనే విమర్శ కాదనలేనిది. దర్యాప్తు, విచారణలు సుదీర్ఘంగా సాగడం వల్ల వారి రాజకీయ జీవితం దెబ్బతింటుంది. కానీ కొందరు రాజకీయ నాయకులు నిర్దోషిగా తర్వాతి కాలంలో బయటపడినప్పటి కీ, వారిపై దర్యాప్తు క్రమమే శిక్షగా మారుతున్నది. చిదంబరం నేరం చేశారా లేదా అనేది న్యాయస్థానాలలో తేలుతుంది. కానీ ఆయనపై దర్యాప్తును వేగంగా సాగించి, తొందరగా ముగించాలె. కేం ద్రంలో ఏ రాజకీయపక్షం అధికారంలో ఉన్నప్పటికీ, నిజాయితీగా దర్యాప్తులు సాగించినప్పుడు ఇటువంటి ఆరోపణలు రావు. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరి స్తే, అవినీతి నిర్మూలన జరుగడమే కాకుండా ప్రభుత్వం విశ్వసనీయతను కాపాడుకోగలదు.

346
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles