హర్షణీయం


Tue,September 17, 2019 01:00 AM

గత కొన్ని రోజులుగా తెలంగాణలో యురే నియం తవ్వకాల విషయంలో ఏర్పడిన భయాందోళనలకు ప్రభుత్వ నిర్ణయంతో భరోసా వచ్చింది. ఈ విషయమై ముఖ్య మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చర్చ చేశారు. యురేనియం తవ్వకాలతో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నదని, ఎట్టి పరిస్థితు ల్లోనూ యురేనియం తవ్వకానికి అనుమ తిచ్చేది లేదని సీఎం కేసీఆర్ చెప్పటం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో నల్లమ ల ఆదివాసీ ప్రజలకు ఊరట కలిగింది. యురేనియం తవ్వకాలపై ప్రభుత్వ నిర్ణ యానికి మద్దతుగా ప్రజలు కూడా అప్ర మత్తంగా ఉండాలి. యురేనియం తవ్వకా లను ఎవరు ఏ రూపంలో చేపట్టినా వ్యతిరే కంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎం తైనా ఉన్నది.
- కొలిపాక శ్రీనివాస్ గౌడ్, సముద్రాల


సీఎం నిర్ణయం అభినందనీయం

కేంద్రం ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టం-2019 గతకొన్ని రోజులుగా వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టం-2019ను రాష్ట్రంలో అమలుచేసి, వాహనదారులను ఇబ్బందుల కు గురిచేయబోమని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయం హర్షణీయం.
- పెరుక శ్రావణ్, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా

సంక్షేమం కోసమే అప్పు

గుమ్మి ఖాళీ కావొద్దు, గూటమోలో పిల్లలుండాలె అన్నట్లే ఉన్నది రాష్ట్రం లోని ప్రతిపక్షాల పనితీరు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని, మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నదని విమర్శిస్తు న్నారు. ప్రభుత్వం అప్పులు చేసి వృథా ఖర్చులు చేయటం లేదు. సాగునీ టి రంగ ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నది. అయినా మిగతా రాష్ర్టాల కన్నా రాష్ట్ర అప్పులు తక్కువనేది ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం అప్పు చేస్తే తప్పులేదనే విషయం కూడా గుర్తించాలి.
- కొత్వాల్ ప్రవీణ్‌కుమార్, బేగంపేట, హైదరాబాద్

111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles