తప్పెవరిది?


Tue,September 17, 2019 11:13 PM

PAPI-KONDALU
ప్రకృతి అందాల నడుమ
పరవశాన నాట్యమాడుతూ
పిన్న పెద్దలు కేరింతలు కొడుతూ
సెలవు రోజున సేదతీరుతూ
గోదారిపై పయనిస్తుంటే
విధి వంచించిది మృత్యువు కాటేసింది
ఎవరు చేసిన తప్పిదమిది
పర్యాటకులు చేసిన పాపమేమి..!
నిండుకుండలాంటి గోదాట్లో తిరిగి
పాపికొండలతో ముచ్చటిస్తూ
ఉరుకు పరుగుల జీవితాన
ఆత్మీయులతో కలిసి సాగుతున్న నావ
నీటిలో మునిగి మరణశాసనం రచించడం
ఇదెక్కడి న్యాయం సబబేనా..!
యంత్రం లోపమా, రక్షణ కవచాలు లేకనా
పడవ అలలకు బోల్తాపడేనా.. అంటూ
సమస్యల సాకు చూపడమేలా...!
పర్యాటకులను క్షేమంగా దరిచేర్చడమే ధర్మం
విషాద ఛాయలెప్పుడున్నా
రక్షించే మార్గం ఉండాలపుడే
కన్నీటి పర్యంతం పాపికొండల ఘటన
ఇకనైనా జాగ్రత్త సుమా! పర్యాటక మిత్రమా!


- ఉండ్రాల రాజేశం 9966946084

132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles