మాయాజాలంగా మారిన విజ్ఞానం


Wed,September 18, 2019 01:14 AM

modi-isro
చంద్రయాన్ 2 గురించి ఉద్వేగపడకపోతే అదో పాప మైపోయింది! అదొక బృహత్తర వీరోచిత కార్యం! శాస్త్రవేత్తల నైపుణ్యాలన్నీ కుమ్మరించి చేస్తున్న ఘనకార్యం! చంద్రయాన్ 2ను ఉద్వేగభరిత జాతీయ కార్యంగా ప్రచారం చేసిపెట్టారు. 130 కోట్ల మందికి గర్వకార ణం! శాస్త్రవిజ్ఞాన ముందంజ కన్నా సత్యం గొప్పది. అన్నీ పణంగా పెట్టయినా సత్యాన్ని కాపాడుకోవాలె. మొదటగానే చంద్రయాన్ 2 అనగానే దేశవ్యాప్తంగా పూనకం వచ్చే లాగా కావాలనే తయారుచేసి పెట్టారు. చం ద్రయాన్ 2 పట్ల ఎంత ఉద్వేగాలు సృష్టించారూ అంటే, ఇంతకూ ఆ పథకం అంటే ఏమిటో, దానివల్ల వారికి కలిగే ప్రయోజనమేమిటో అర్థం చేసుకోకుండానే ఉద్వేగానికి గురవుతారు. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి రెండు అంశాల మధ్య తేడాను మనం గమనించాలె. మొదటిది- నిజ జీవితానికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానం. ఇది మానవుల జీవితాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధులకు చికిత్స చేయడం, ప్రయాణ సాధనాల ను, కమ్యూనికేషన్ సంబంధాలను పెంచడం, ప్రజలను మూఢ నమ్మకాల నుంచి బయటపడేయడం, ప్రజలు గౌరవంగా, స్వేచ్ఛగా జీవించే విధంగా సాధికారత కల్పించడం మొదటిరకం శాస్త్ర విజ్ఞానం. ఇక రెండవ రకం శాస్త్రవిజ్ఞానం కనికట్టులు చేసేది. శాస్త్ర విజ్ఞానాన్ని సాధనంగా చేసుకున్నప్పటికీ, ప్రజలను మాయలో పడేసే విజ్ఞానమిది. శాస్త్రవిజ్ఞాన విజయాలను చూపించి, వారికి తమ బాధలు గుర్తు రాకుం డా చేసేది. ఇటువంటి శాస్త్రవిజ్ఞాన ఆర్భాటాలు ప్రజల సంక్షేమానికి వ్యతిరేకమైనవి. సామాజిక, రాజకీయ,ఆర్థిక శిష్ట వర్గ ప్రయోజనాలు కాపాడేవి. ఈ ఆర్భాటాలు సామాన్యుల స్వేచ్ఛను హరించేవి. ప్రజలను ప్రభు త్వ నిఘా నీడలోకి నెట్టేవి. ఇప్పుడు అంతటా విస్తరిస్తున్న కమ్యూనికేష న్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలు, అత్యాధునిక నిఘా పరికరాలు, ఇతర సాంతికేక పరిజ్ఞానాలు నిస్సందేహంగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.


ఈ కాలంలో కనిపిస్తున్న ప్రత్యేక పోకడ-శాస్త్రవేత్తలకు, రాజకీయ వ్యవస్థకు మధ్య సాన్నిహిత్యం పెరుగడం. ఇందుకు ఇటీవలి ఉదాహరణ-ఇస్రో శాస్త్రవేత్తల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ తిరుగాడటం, ఇస్రో చీఫ్ కె.శివన్ ఎవరో దగ్గరివాళ్ళను పోగొట్టుకున్నట్టు ప్రధాని భుజాలపై వాలి బావురుమనడం. శాస్త్ర విజ్ఞానం రాజ్యానికి పనిమనిషిగా మారితే ఇక వృద్ధిచెందడం అంటూ ఉండదు. శాస్త్ర విజ్ఞాన చరిత్ర గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.


ఈ పరిస్థితి వల్ల అప్రమత్తం కావడం వల్లనే ఫ్రెంచి తత్తవేత్త జాక్ ఇల్యుల్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పశ్చిమ ద్రోహం (బిట్రాయల్ ఆఫ్ ది వెస్ట్)గా అభివర్ణించారు. ఆధునిక ఉన్నతస్థాయి పరిశోధనలలోని రెండు కోణాలు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటిది- ఈ పరిశోధనల ప్రధాన ఉద్దేశం సైనిక యుద్ధరీతులను మరింత సునిశితంగా తీర్చిదిద్దడం. అంతరిక్షానికి కూడా ఈ హింసాద్వేషాలను వ్యాపింపచేయడం. అంతరిక్షాన్ని ఆయుధమయం చేయడం. ఇది భూమిపై యుద్ధాల కన్నా ఖండించదగిన విష యం. అమెరికా, ఒకప్పటి సోవియెట్ యూనియన్ అంతరిక్షరంగంలో పోటీ పడటానికి కారణం- అంతరిక్ష యుద్ధాలు జరిగితే అందుకు సన్న ద్ధం కావడమే. ఇక అత్యంత ఆందోళన కలిగించే రెండవ విషయం- ఈ సాంకేతిక అభివృద్ధి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానాలు విస్తృతమయ్యే కొద్దీ పౌరులపై ప్రభుత్వ నిఘా పెరుగుతున్నది. అంతరిక్షంపైనే కాదు, మన వ్యక్తిగత పరిధిలోకి దాడి జరుగుతున్నది. ఇప్పుడు వ్యక్తిగతం అనేది ఒక సూత్రప్రాయమైన అంశంగానే మిగిలిపోయింది. మన ప్రతి కదలిక ప్రభుత్వానికి చేరుతుంది. మన సం బంధాలు, కార్యకలాపాలు, మన ప్రకటనలు, మన ఆలోచనలు అన్నీ నిఘాలో ఉంటున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాకపోతే, అర్బన్ నక్సల్స్ అనే భావన ముందుకు రాకపోయేది. ఈ కాలంలో కనిపిస్తున్న ప్రత్యేక పోకడ-శాస్త్రవేత్తలకు, రాజకీయ వ్యవస్థకు మధ్య సాన్నిహిత్యం పెరుగడం. ఇందుకు ఇటీవలి ఉదాహర ణ-ఇస్రో శాస్త్రవేత్తల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ తిరుగాడటం, ఇస్రో చీఫ్ కె.శివన్ ఎవరో దగ్గరివాళ్ళను పోగొట్టుకున్నట్టు ప్రధాని భుజాలపై వాలి బావురుమనడం. శాస్త్ర విజ్ఞానం రాజ్యానికి పనిమనిషిగా మారితే ఇక వృద్ధిచెందడం అంటూ ఉండదు. శాస్త్ర విజ్ఞాన చరిత్ర గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ఒకవైపు ఇస్రో గ్రౌండ్ స్టేషన్ చంద్రుడిపైకని ప్రయోగించిన విక్రమ్ లాండర్‌తో సంబంధాలను కోల్పోతే, నా ఆలోచనలు మాత్రం కశ్మీర్ ప్రజల చుట్టూ తిరుగుతున్నాయి. కశ్మీర్‌కు, ఢిల్లీకి కమ్యూనికేషన్ లింక్ తెగిపోయి ఇప్పటికి నెలవుతున్నది. ఇంత భారీ మానవ విషాదం పట్ల దేశం ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటున్నది. మానవ బాధల్లో అత్యంత ఘోరమైం ది అది ఎంత తీవ్రంగా ఉన్నదని కాదు, ఎంత కనిపించకుండా సాగిస్తున్నారనేది. నీ బాధలు ఎవరికీ పట్టవు అన్నంత స్వార్థపూరితంగా సాగుతున్నది.


శాస్త్రవేత్తలు ఏ పోషణ లేకున్నా, ఎంతో వ్యతిరేకత నెలకొన్నా, తమ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి మానవాళికి కానుకగా అందించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. ఇప్పుడు శాస్త్రవేత్తల గణం రాజ్యానికి అనుబంధంగా ఉన్న సర్కస్ కంపెనీగా మారింది. రాజకీయ పెద్దల ఆదేశాలకు శిరసావహిస్తూ, వారి ప్రయోజనాలను కాపాడుతున్నది. చంద్రయాన్-2 అంటే ప్రధానికి ఇచ్చే కానుక అనే రీతిలో ప్రచారం సాగింది. దీనిని శాస్త్ర విజ్ఞానం అనరు, ఇది చెంచాగిరి. ఈ విధానం దేశానికి కానీ, శాస్త్ర విజ్ఞానానికి కాని మంచి చేయదు. శాస్త్ర విజ్ఞానం అంటే రాజ్యానికి మద్దతుగా ఉండాలనడమే ఆందోళన చెందవలసిన విషయం. మోదీ దృక్కోణంలో చంద్రయాన్-2 అంటే ఏదో అసాధ్యమైనదానిని సుసాధ్యం చేసే బృహత్ పథకం. ప్రజల దృష్టి అంతా చంద్రుడిపైకి వాల వలసిన విక్రమ్ లాండర్‌పైనే నిలిపి ఉంచారు. ప్రభుత్వం చేస్తున్న కనికట్టును లౌకిక పద్ధతిలో చూపడమే ఈ అసాధ్యా న్ని సుసాధ్యం చేయడం అనే భావన. ఈ కనికట్టు ప్రభావం ప్రజల జీవ న వాస్తవికతలపై ఏ మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడు ఏర్పడే భ్రమల కూడిన అద్భుతమిది. ఒక కనికట్టు తర్వాత మరో కనికట్టును సృష్టిస్తారు. ఎంతో నయనానందకరంగా సాగుతుంది. కానీ ప్రజల జీవితాలు మార వు లేదా ఇంకా అధ్వాన్నంగా మారుతయి. వారి నిజ జీవితంలోని బాధ ల నుంచి దృష్టి మళ్ళేవిధంగా రోజుకో అద్భుతం ఆవిష్కరింపజేస్తూ ఉం టారు. మన శాస్త్రవేత్తలు సామాన్యుడి జీవితాలను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి తమ మేధస్సును, నైపుణ్యాలను వినియోగించరెందుకు? ఒకవైపు ఇస్రో గ్రౌండ్ స్టేషన్ చంద్రుడిపైకని ప్రయోగించిన విక్రమ్ లాండర్‌తో సంబంధాలను కోల్పోతే, నా ఆలోచనలు మాత్రం కశ్మీర్ ప్రజల చుట్టూ తిరుగుతున్నాయి.
Swamy-agnivesh
కశ్మీర్‌కు, ఢిల్లీకి కమ్యూనికేషన్ లింక్ తెగిపో యి ఇప్పటికి నెలవుతున్నది. ఇంత భారీ మానవ విషాదం పట్ల దేశం ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటున్నది. మానవ బాధల్లో అత్యంత ఘోరమైం ది అది ఎంత తీవ్రంగా ఉన్నదని కాదు, ఎంత కనిపించకుండా సాగిస్తున్నారనేది. నీ బాధలు ఎవరికీ పట్టవు అన్నంత స్వార్థపూరితంగా సాగుతున్నది. అక్కడి ప్రజలను ఈ స్థాయిలో నిర్బంధంలో పెట్టారూ అంటే- ప్రజలను ప్రజలుగా గుర్తింపు లేకుండా చేయడానికి ఇంతకన్నా కఠిన విధానం ఏమీ ఉండదు. కశ్మీర్ ప్రజలకు ఏ మాత్రం స్వాతంత్య్రం లేకుం డా చేశారు. ఇప్పుడు కశ్మీర్ ప్రజలను చేరుకోవడం చంద్రుడిని చేరుకోవడం కన్నా పెద్ద కష్టం. మన శాస్త్రవేత్తలకు ఇటువంటి వాస్తవికతలు ఉనికిలో లేనట్టే లెక్క.

(రచయిత: ఆధ్యాత్మిక నాయకుడు, సంఘ సంస్కర్త, ఆర్యసమాజ్ ప్రపంచ అధ్యక్షుడు)
ది వైర్ సౌజన్యంతో...

480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles