ఉపశమన చర్యలు చేపట్టాలి


Fri,September 20, 2019 12:45 AM

దేశంలో నెలకొన్న మాంద్యం పరిస్థితుల గురించి ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాత్కాలిక ఉపశమన చర్యలతో ఫలితం ఉండదని వారు చెబుతున్నారు. అయినా కేంద్రం వీటిని పెడచెవిన పెట్టడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నది. అట్లనే కేంద్ర మంత్రులు కూడా పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి, పడిపోతున్న ఆటోమొబైల్ అమ్మకాల గురించి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే రోగమొకటి అయితే మందుఒకటి వేస్తున్నట్టు ఉన్నది. మాంద్యం ప్రభావం ఎక్కువగా ఏ రంగాలపై ఉన్నది, దాని నష్టం నుంచి ఆయా రంగాలను బైటపడేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. అన్ని రాష్ర్టాలతో సంప్రదింపులు చేపట్టాలి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. దానికనుగుణంగా ఉపశమన చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేగానీ ఒంటెద్దుపోకడలతో నష్టమే తప్పా లాభం ఉండదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.
-జే. భానుప్రసాద్, హైదరాబాద్


బాధ్యతగా వ్యవహరించాలి

రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 ఉన్నాయి. కానీ కేంద్ర హోంమంత్రి ఒకే దేశం-ఒకే భాష వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపాయి. ఆయన వ్యాఖ్యల పట్ల ఇప్ప టికే చాలారాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వివాదంపై కేంద్ర మంత్రి వివరణ ఇచ్చినా వాళ్ల అసలు అజెండా ఏమిటో దేశ ప్రజల ముందు ఉంచాలి. ముఖ్యం గా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలను గందరగోళపరిచే అనేక వివాదాస్పద వ్యాఖ్యలు అనేకం చేశారు. వీటిని ప్రధాని లాంటి వాళ్లు మన విధానం కాదని చెప్పినా పదేపదే అవే వ్యాఖ్యలు పునరావృతం అవుతున్నాయి. మనదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నాయి. అన్నివర్గాల వారి సంస్కృతి సంప్రదా యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టవద్దు. ఇక ముందు వ్యాఖ్యలు చేసే ముందు ప్రజాప్రతినిధులు బాధ్య తగా వ్యవహరించాలి.
-ఎ. అజేయ్, ఆలేరు

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles