తెలంగాణ ప్రజల అస్తిత్వం ‘బతుకమ్మ’


Fri,October 4, 2019 01:46 AM

తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక మన బతుకమ్మ పం డుగ. అందుకే తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజల చేతి లో ఆయుధంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత రాష్ట్ర పండుగ అయింది. కుల మతాలకు అతీతంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. బతుకమ్మ పండుగలో పూలు, పాటలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మహిళలు బతుకమ్మ పాటల్లో తమ కష్టసుఖాలు, ఆప్యాయతానురాగాలు, స్నేహబంధుత్వాలు, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పండుగ ఎలా మొదలైందని చెప్పడానికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ కింద మహిళలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకునేవారిని చూసి తోటి మహిళలు విచారించేవారు. వారి ప్రతీకగా పూలను పేర్చి బతు కు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. అందుకే బతుకు+అమ్మ బతుకమ్మ అయింది. కొన్ని వేల ఏండ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ భూస్వామ్య విధానం కంటే చాలాకాలం ముందు నుంచే తెలంగాణ శ్రమజీవుల జీవితాల్లో భాగమైంది. తెలంగాణ ప్రాంత ప్రజల బతుకుదెరువు ప్రధానంగా చెరువులు. తెలంగాణ ప్రజానీకం అత్యధికంగా చెరువుల పక్క న జీవించారు. తమకు బతుకునిచ్చిన చెరువులకు కృతజ్ఞతలు చెప్పుకుం టూ తెలంగాణ ప్రజలు చెరువుల పండుగ చేసుకునేవారు. క్రమంగా అది బతుకమ్మగా మారిందని మరికొందరి మేధావుల అభిప్రాయం. బతుకమ్మ పండుగలో సంస్కృతి, శాస్త్రీయత నిండుగా కనిపిస్తాయి. బతుకమ్మలో ఉపయోగించే తీరొక్కపూలు (తంగేడు, గునుగు, రుద్రాక్ష, గుమ్మడి, మం దార, బంతి, గులాబీ) దివ్య ఔషధాలే! ఇవి మానవ ఆరోగ్యానికి ఆయుర్వేద వైద్యంలో ఎంతగానో ఉపయోగపడినాయి. పూల బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల పూలకు, ఆకులకు ఉన్న రసాయనాలతో బాక్టీరియా నశిస్తుంది. నీటిశుద్ధి జరుగుతుంది. బతుకమ్మ పండుగలో ప్రత్యేకత ఏమంటే దేశంలో ఎక్కడైనా పూలతో దేవుళ్లను పూజిస్తారు. తెలంగాణ బతుకమ్మలో పూలనే దేవతగా కొలుస్తారు.


మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులు మనల్ని గౌరవిస్తారని బలంగా నమ్మే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్ట్రం యావత్తు గర్వించేలా బతుకమ్మకు చారిత్రక గౌరవ కిరీటాన్ని తొడిగారు. తెలంగాణ సాంసృ్కతిక సింహాసనంపై అధిష్టించారు. బతుకమ్మ పండుగలోని అంతర్లీనంగా ఉన్న సామాజిక అంశాలన్నింటిపై కృషి సలుపుతున్నారు.


ఈ విలక్షణమైన సంస్కృతి కేవలం తెలంగాణలోనే కనిపిస్తుంది. బతుకమ్మ పండుగలో భక్తితో పాటు అనేక సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయి. మహిళా రక్షణ, అభివృద్ధి, సాధికారత, సహనం, కుటుంబ బాంధవ్యాలు, సామాజిక ఏకత్వం, పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా మహిళల ఔన్నత్యం ఇమిడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో ఎన్నెన్నో పండుగలున్నాయి. కానీ బతుకు విలువ తెలియజెప్పే పండుగ మాత్రం మన బతుకమ్మ ఒక్కటే! విస్తృతంగా మహిళలు జరుపుకునే ఉత్స వం కూడా బతుకమ్మ పండుగే అని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ పండుగలు నిర్లక్ష్యం చేయబడినా యి. మహిళలకు రక్షణ కరువైంది. మహిళా అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడిం ది. ప్రత్యేకించి కాయకష్టం చేసుకొని బతికే పేదవారు తీవ్రమైన ఆర్థిక, సామాజిక అభద్రతను ఎదుర్కొన్నారు. మహిళలపై దాడులు, లైంగికదా డులు, హత్యలు, వరకట్న వేధింపులు రోజురోజుకు పెరిగాయి. వైద్యరం గంలో వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకొని గర్భంలోనే ఆడబిడ్డను అంతం చేయడం పరిపాటిగా మారింది. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్ల ఇంటికి భారంగా మారింది. చదువు విషయంలో దళిత, గిరిజన, మైనార్టీ మహిళల్లో సగం మంది కూడా చదువుకున్నవారు లేరు. బాలింత మరణాలు పెరిగాయి. గర్భిణీ మహిళల్లో రక్తహీనత ఎక్కువ. సరైన ప్రభుత్వ వైద్య సహాయం, ప్రోత్సాహకాల్లేవు. ఒకవిధంగా చెప్పాలంటే ఆడపిల్లలను పుట్టనిచ్చేది లేదు. పుడితే బతుకనిచ్చేది లేదనే చందంగా మహిళల బతుకులు మారాయి. మహిళల ఎదుగుదల, గౌరవం, సాధికారత వారి జీవితాల్లో మచ్చుకైనా లేకుండాపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినాక ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ తొలి ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించింది. బడ్జెట్‌ లో సింహభాగం సంక్షేమానికి కేటాయించింది. ప్రభుత్వం ప్రకటించే ప్రతి సంక్షేమ పథకానికి మహిళలనే కేంద్రంగా తీసుకున్నది. మూడెకరాల భూమి ఇచ్చినా, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చినా, ఇండ్ల పట్టాలు, పింఛ న్లు ఇచ్చినా ప్రభుత్వం మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ చర్చ మహిళా సాధికారతను, గౌరవాన్ని పెంపొందిస్తుంది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలు మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టినవే.
sakinala-Bhavani
ఈ పథకాలన్నీ మహిళల అభ్యున్నతికి తోడ్పడినాయి. ‘నెస్ట్‌వే’ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో హైదరాబాద్‌ అన్నింటికంటే సురక్షితమైన నగరమని ఎక్కువమంది మహిళలు అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్‌ కమిటీల్లో కూడా రాష్ట్ర ప్రభు త్వం 33 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. రైతు సంక్షేమ కోసం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితిలో 1/3 వంతు మహిళలను ఎంపిక చేసింది. మహిళలకు చట్ట సభ ల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. తద్వారా మహిళల రాజకీయ ఉన్నతికి అవకాశం ఏర్పడుతుంది. రక్షిత మంచినీటి సమస్య పరిష్కారానికి, మంచినీరు కోసం మహిళలు పడే తండ్లాట పోగొట్టడానికి మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. చెరువులకు చెట్లకు బతుకమ్మ పండుగకు తెలంగాణ సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. మిషన్‌ కాకతీయ, హరితహారం కార్యక్రమం చెట్ల పెంపకం ద్వారా చెరువులు కళకళలాడుతాయి. తెలంగాణ హరితహారంగా మారుతుంది. దీంతో ప్రతీ కుటుంబం సుఖసంతోషాలతో జీవిస్తుం ది. బతుకమ్మ పండుగను తరతరాలకు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఎక్కడ స్త్రీలు పూజించబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారని భారతీయుల నమ్మకం. నేడు తెలంగాణలో అదే జరుగుతుంది. సమాజంలో సగభాగం మహిళలు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళల అభివృ ద్ధి కీలకం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి ఒక తండ్రి వలె, ఆడబిడ్డలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ మహిళా సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నారు. మహిళా భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులు మనల్ని గౌరవిస్తారని బలంగా నమ్మే మన ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్ట్రం యావత్తు గర్వించేలా బతుకమ్మకు చారిత్రక గౌరవ కిరీటాన్ని తొడిగారు. తెలంగాణ సాంసృ్కతిక సింహాసనంపై అధిష్టించారు. బతుకమ్మ పండుగలోని అంతర్లీనంగా ఉన్న సామాజిక అంశాలన్నింటిపై కృషి సలుపుతున్నారు. అందుకే తెలంగాణ మహిళా లోకం కేసీఆర్‌ వెంట ఉన్నది.

(రచయిత్రి: ములుగు మండల జడ్పీటీసీ సభ్యురాలు)

337
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles