రాష్ర్టాలను అడ్డుకుంటున్న కేంద్రం


Fri,October 4, 2019 01:47 AM

కేంద్రానికి, రాష్ర్టాలకు గల మధ్య సంబంధాల్లో, దక్షిణాది రాష్ర్టాలు కొన్ని దశాబ్దాలుగా కేంద్రం చేతిలో నలిగిపోతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల ప్రజల రక్తమాంసాల నుంచి వసూలుచేసిన ఆదాయం ఇక్కడి ప్రజలకు ఉపయోగించకుండా, అభివృద్ధిలో వెనక్కినెడుతున్నారు. కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య రాజకీయపార్టీల మధ్యగల స్పర్థ, గెలుపోటముల సమస్య ఇమిడి ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు జాతీయోద్యమ స్ఫూర్తితో వారు చీలిపోయిన దేశాన్ని ఒక్కటిచేయడం గురించి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 70 ఏండ్లు గడిచిన తర్వాత ఆయా రాష్ర్టాలకు, కేంద్రానికి అనే క కొత్త అనుభవాలు, గుణపాఠాలు కలిగాయి. ఒక రాష్ట్రంలోని ప్రభు త్వం తాము తిరిగి ఎన్నిక కావాలని కొన్ని మంచి పనులు చేస్తే తాము గెలుస్తామనుకోవచ్చు. కేంద్రంలో ఉండే పార్టీలు అలా జరిగితే తాము విస్తరించడం, ఎదుగడం సాధ్యం కాదని భావించి రాష్ర్టాల శాసనాలను, పథకాలను అడ్డుకోవచ్చు. నిర్వీర్యం చేయవచ్చు. ఉదాహరణకు తెలంగాణ బీసీ కమిషన్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన బీసీ-ఈ గ్రూపు రిజర్వేషన్లను కేంద్రం వ్యతిరేకించడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా నిష్పత్తులు మారాయి. అందువల్ల విద్య, ఉద్యోగ, అభివృద్ధి, సంక్షేమరంగాల్లో, సామాజికవర్గాల దామాషా ప్రకారం అన్నింటిని సరిచూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రీత్యా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీలకు 16 ఎస్టీలకు 10, ముస్లిం మైనారిటీల కు 12 శాతం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు జనాభా దామాషా మేర కు రిజర్వేషన్లు పెంచాలని, తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్లను ఆదర్శంగా తీసుకున్నారు. మొత్తం రిజర్వేషన్లు 75-80 శాతం చేయాల్సి రావచ్చునని పలుసార్లు ప్రకటించారు. పెంచుకున్న రిజర్వేషన్లను కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కూడా. కానీ కేంద్రం వాటిని పెండింగ్‌లో పెట్టింది. ఒక దశలో వీలుకాదని నిరాకరించింది. ఈ దశలో ఆయా రాష్ర్టాలు ఏం చేయాలి. ఫెడరలిజంలో భాగంగా తమ హక్కులను, అధికారాలను సాధించుకోవాలని కోరుకోవడం సహజం. 50 శాతం మించిన రిజర్వేషన్ల గురించి న్యాయస్థానాలు, అలవికాని, ఆచరణలో సాధ్యం కాని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.


కొత్త పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, అధికారాలు, సంబంధాలకు సంబంధించిన ఆర్టికల్స్‌లలో ఎన్నిచేర్చినా, కేంద్రం ఒక్క వేటుతో అన్నింటిని తన హస్తగతం చేసుకోగలుగుతున్నది. అందువల్ల రాజ్యాంగంలోని ఇతర ఆర్టికల్స్‌ ద్వారా ఆయా రాష్ర్టాలకు స్వయం సంపూర్ణ అధికారం సాధించడానికి ఇతర మార్గాలు అన్వేషించడం అవసరం.


జనాభా ప్రాతిపదికన తీసుకుందామంటే జనాభా లెక్కలను కేం ద్రం తప్ప, రాష్ర్టాలు తీయడానికి వీల్లేదని, తీస్తే వాటికి ప్రామాణికత, గుర్తింపు లేదని పేర్కొన్నది. ఈ దశలో ఇతర మార్గాలను అన్వేషించాలి. కొత్త పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, అధికారాలు, సంబంధాలకు సంబంధించిన ఆర్టికల్స్‌లలో ఎన్నిచేర్చినా, కేంద్రం ఒక్క వేటుతో అన్నింటిని తన హస్తగతం చేసుకోగలుగుతున్నది. అందువల్ల రాజ్యాంగంలోని ఇతర ఆర్టికల్స్‌ ద్వారా ఆయా రాష్ర్టాలకు స్వయం సంపూర్ణ అధికారం సాధించడానికి ఇతర మార్గాలు అన్వేషించడం అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 2 అనేది కొత్త రాష్ర్టాలను కలుపడం. పార్లమెంట్‌ శాసనాల ద్వారా కొత్త రాష్ర్టాలను, దేశంలో చేర్చుకోవచ్చు. కొత్త రాష్ర్టాలను ఏర్పాటుచేయవచ్చు. ఆర్టికల్‌ 2 ఏ ద్వారా భారతదేశంలో సిక్కింను ఒక రాష్ట్రంగా చేర్చుకోవడం జరిగింది. ఆర్టికల్‌ 3లో కొత్త రాష్ర్టాల ఏర్పాటు. రాష్ర్టాల సరిహద్దుల సవరణ చేసే అధికారం పార్లమెంటుది. ఆ అధికారాలు ఇలా ఉంటాయి. ఎ) ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. రెండు, లేక అంతకన్నా ఎక్కువ రాష్ర్టాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. కొన్ని రాష్ర్టాల, ప్రాంతాలను కలిపి రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడం. ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రంతో కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం. బి) ఆర్టికల్‌ 3లో ఒక రాష్ట్ర భూభాగాన్ని, సరిహద్దులను విస్తరించవచ్చు. సి) ఒక రాష్ట్ర సరిహద్దులను, భూభాగాన్ని తగ్గించవచ్చు. డి) రాష్ట్ర సరిహద్దులను మార్చవచ్చు. ఇ) రాష్ట్రం పేరును మార్చవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 4లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 2, 3 ప్రకారం చేసిన శాసనాలు మార్పుచేర్పులు రాజ్యాంగ సవరణలుగా లెక్కించబడవు. దేశం అన్నా, రాష్ట్రం అన్నా, ప్రాంతం అన్నా ఏర్పాటు ఆయా భూ భాగాల్లో నివసిస్తున్న ప్రజలను ఒక రాష్ట్రంగా, ఒక పరిపాలన కిందికి తీసుకురావడం, ఒక రాష్ర్టాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటుచేయడం. జనాభా నిష్పత్తి మారుతుంది. ప్రజలకు రాష్ట్రస్థాయిలో పరిపాలనా వ్యవస్థను ఏర్పాటుచేయడం, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడమంటేనే, ఆ రాష్ట్ర ప్రజలను, ఇంతకుముందున్న రాష్ర్టాల పరిపాలన నుంచి వేరుచేసి కొత్త రాష్ట్ర పరిధిలోని ప్రజలకు తమకుతాము పరిపాలించుకునే సౌకర్యం కలుగడం.

రాష్ర్టాల ఏర్పాటు అనేది ఆయా రాష్ట్ర ప్రజల గురించిన ఏర్పాటు. రాష్ట్ర ప్రజలు ఆయా సామాజికవర్గాలుగా, కులాలు, మతాలు, తెగలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా, అభివృద్ధి అందుకున్న వారీగా, అభివృద్ధి
అందుకోలేకపోతున్నవారీగా కొనసాగుతున్నారు. కాబట్టి వీరందరు కలిసిన సమూహమే రాష్ట్ర ప్రజలు. పలు సామాజికవర్గాల అభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, సమానావకాశాలు అందుకునే ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవంతో, తమ జనాభా దామాషా మేరకు, సమస్థ రంగాల్లో ప్రాతినిధ్యం పొందడం ద్వారానే అది మొత్తం ప్రజల అభివృద్ధి, సంక్షేమం అవుతుంది. అందువల్ల ఒక రాష్ట్రం ఏర్పాటు అనేది తొలిమెట్టు మాత్రమే.


కొత్త రాష్ర్టాలను ఏర్పర్చినప్పుడు ఆ రాష్ట్ర సరిహద్దుల్లో జనాభా నిష్ప త్తి, సామాజికవర్గాల నిష్పత్తి, భాషలు, సంస్కృతులు, అభివృద్ధి విధానాలు, వనరుల వినియోగం, కొత్త శాసనసభ, శాసనమండలి, ముఖ్యమంత్రి, మంత్రివర్గం, సెక్రటేరియేట్‌ మొదటైనవాటితో పాటు కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కొత్తగా రూపొందుతాయి. ఇలా 565 సంస్థానాలు, బ్రిటీష్‌ పాలిత ప్రాంతాలు, ఫ్రెంచి పాలిత ప్రాంతాలు, డచ్‌ పాలిత ప్రాం తాలు కలిపి 14 రాష్ర్టాలుగా 1956 నవంబర్‌ 1న ఏర్పాటు చేయడం జరిగింది. శతాబ్దాలుగా ప్రత్యేక అస్తిత్వంతో, పరిపాలనావ్యవస్థలతో ఏర్పడుతూ వచ్చిన వందలాది ప్రాంతాలను 14 రాష్ర్టాల్లోకి కుదించి ఏర్పాటుచేయడంతో అనేక కొత్త చిక్కులు, కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 14 రాష్ర్టాలుగా కుదించడంలో కొన్ని ప్రాతిపదికలు తీసుకున్నప్పటికీ ఇతర అనేక అంశాలైతే అవి అలా 14 రాష్ర్టాలుగా కలుపడం అశాస్త్రీయం. అంతర్గత వలసాధిపత్యానికి, అంతర్గత ఆక్రమణలకు రాజబాట వేసింది. దీన్నుంచి తల విదిలించి ఉద్యమాలు చేయడం ద్వారా మరో 15 రాష్ర్టాలు ఏర్పాటుచేయబడ్డాయి. అలా ప్రస్తుతం 29 రాష్ర్టాలు దేశంలో కొనసాగుతున్నాయి. 9 కేంద్రపాలిత ప్రాంతాలు వీటికి అదనం. అయినప్పటికీ ఆయా రాష్ర్టాల్లోని ప్రజలకు పూర్తి న్యాయం జరుగలేదు. తమకు న్యాయం జరుగడంలేదని, సాధికారికతలో భాగస్వామ్యం కాలేకపోతున్నామని, ఇతరులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, దేశవ్యాప్తం గా అనేక ప్రాంతాల్లో కొత్త రాష్ర్టాలు ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారు. రాష్ర్టాల ఏర్పాటు అనేది ఆయా రాష్ట్ర ప్రజల గురించిన ఏర్పాటు. రాష్ట్ర ప్రజలు ఆయా సామాజికవర్గాలుగా, కులాలు, మతాలు, తెగలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా, అభివృద్ధి అందుకున్న వారీగా, అభివృద్ధి అందుకోలేకపోతున్నవారీగా కొనసాగుతున్నారు. కాబట్టి వీరందరు కలిసిన సమూహమే రాష్ట్ర ప్రజలు. పలు సామాజికవర్గాల అభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, సమానావకాశాలు అందుకునే ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం తో, తమ జనాభా దామాషా మేరకు, సమస్థ రంగాల్లో ప్రాతినిధ్యం పొంద డం ద్వారానే అది మొత్తం ప్రజల అభివృద్ధి, సంక్షేమం అవుతుంది. అందు వల్ల ఒక రాష్ట్రం ఏర్పాటు అనేది తొలిమెట్టు మాత్రమే. దేశమంటే మట్టికాదు, దేశమంటే అందులో నివసించే ప్రజలు. రాష్ట్రమంటే అందులో నివసించే ప్రజలు.
BS-Ramulu
అందువల్ల ఆయా రాష్ర్టాల్లోని, ఆయా సామాజిక వర్గాల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం చేసే శాసనాలు, సౌకర్యాలు, శాసనాలకు కూడా నైతికంగా ఆర్టికల్‌ 2, 3కు సంబంధించినవే. ఆర్టికల్‌ 2, 3 లలో అంతర్లీనంగా ఉన్నప్పుడే సామాజిక న్యాయం, సమానావకాశాలు అందువల్లే ఆర్టికల్‌ 14, 15, 16 తదితర ఆర్టికల్స్‌లో వీరి అభివృద్ధి సంక్షేమం కోసం చేసే శాసనాలకు లోబడి ప్రాథమిక హక్కులుంటాయని క్లాజులు చేర్చడం జరిగింది. వీటిని మరింత బలోపేతం చేయడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం, విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో జనాభా దామాషా మేరకు అభివృద్ధి, సంక్షేమం, ప్రాతినిధ్యం, సాధికారికత కోసం చేసే శాసనాలు ఆర్టికల్‌ 2, 3లో భాగంగా కొన్ని క్లాజులు చేర్చి, వాటికి అనుబంధంగా షెడ్యూళ్ళలో చేర్చాలి. అప్పుడే రాష్ట్రం అంటే రాష్ట్రంలో నివసించే ప్రజలు అని స్పష్టంగా చెప్పినట్టవుతుంది. ఆయా సామాజికవర్గాల కోసం చేసే శాసనాలు, రాజ్యాంగ సవరణలుగా పరిగణించనప్పుడే ఆయా సామాజిక వర్గాలను రాజ్యాంగ పరిధిలో చేర్చినట్లవుతుంది. అవి రాజ్యాంగ సవరణ కిందికి వస్తే, వారు అంతదాకా రాజ్యాంగం వెలుపలివారుగా, వెలివేతకు గురైనవారుగా అంగీకరించినట్టవుతుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలి. గతంలో చేసిన రాజ్యాంగ సమీక్షలో ఈ అంశా న్ని గుర్తించినట్టు కనపడదు. మళ్ళీ రాజ్యాంగ సమీక్ష చేయాలంటున్న సందర్భంగా, ఈ విషయాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది.

(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌)

316
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles