విజయాల దసరా


Mon,October 7, 2019 11:08 PM

dussehra-festival-2019
దసరా పండుగ వచ్చింది
పల్లె జనులతో నిండింది
కష్టసుఖాలు ముచ్చటించింది
చిన్నారులు సంబురంతో చిందులేశారు
బాల్యస్నేహంతో పల్లె మురిసింది
డప్పుల మోత మోగింది
నృత్యకేళితో జనసంద్రం నడిచింది
జమ్మి వృక్షం వద్దకు తరిలారు
ఆయుధపూజలు ఎన్నో చేశారు
పసిడి జమ్మిని జేబులో దాచారు
కొండ కోన ఎక్కి తిరిగారు
పాలపిట్టయంటూ అరిచారు
అరుపులు కేకలతో పరవశించారు
ప్రకృతి అందాలతో కలిసిపోయారు
పసిడి కొమ్మలు చేతబట్టారు
పరుగుల పోటీతో ఇళ్లు చేరారు
పెద్దలందరికి జమ్మి పెట్టి నమస్కరించారు
విజయోస్తంటూ దీవెనలొందారు
విందు వినోదాలతో దసరా గడిపారు
విజయదశమి శుభాలుగా నింపారు
మధుర స్మృతులు మదిన దాచారు
విజయాల దసరాకు జైజైలు పలికారు.
- ఉండ్రాల రాజేశం, 9966946084

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles