దాచేస్తే దాగని మాంద్యం


Mon,October 7, 2019 11:07 PM

భారతదేశంపై ఆర్థికమాంద్యపు చీకటి మేఘాలు కమ్మేశా యి. ఆర్థికమాంద్యం రాలేదని మందగమనం అని నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పరిభాషలో ఇది మోదీ గమనం, ఆర్థిక పరిభాషలో ఆర్థిక మాంద్యం. ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు, వ్యవసాయాధారిత వృత్తుల వాళ్లు, చిన్న పరిశ్రమలు, విద్యార్థులు, సంక్షేమ పథకాలు పొం దుతున్నవారు ఎక్కువగా నష్టపోతారు. రాజ్యాంగబద్ధ స్వతంత్ర ప్రతిప త్తి గల సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్, పార్లమెంట్ ప్రేక్షకపాత్ర వహిస్తున్నప్పుడు ప్రజాస్వామ్య భారతంలో ఒక వ్యక్తి తన చర్యల ద్వారా దేశానికి ఎంతటి నష్టం కలిగించగలడు అనడానికి డిమానిటైజేషన్ చక్కటి ఉదాహరణ. 2016 నవంబర్ 8న రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీ 80 శాతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేశాడు. నోట్లరద్దుకు ప్రధాన ఉద్దేశాలు దేశాన్ని డిజిటలైజేషన్ చేయడం, నల్లధనాన్ని వెలికితీయడం, పన్నులు సక్రమంగా వసూలుచేయడం, తీవ్రవాదాన్ని నిర్మూలించడం, హవాలా మార్గాలను మూసివేయడం, ఆర్థికవ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని పెంచడం అని పేర్కొనడం జరిగింది. ఈ చర్య ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్వర్ణ భారత్ నిర్మాణానికి దారి ఏర్పడుతుందని ఎంతో ఆర్భాటం చేయడం జరిగింది. కానీ, ఏ సమస్య పరిష్కారం కాకపోగా డిమానిటైజేషన్ వల్ల వ్యవసాయ, నిర్మాణ, ఉత్పత్తిరంగాలు దెబ్బతిన్నాయి. ఈ రంగాలు జాతీయ స్థూల ఉత్పత్తిలో 50 శాతం వాటా, ఉద్యోగకల్పనలో 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. శతాబ్దాల తరబడి భారత సంస్కృతిలో భాగమై దేశ ఆర్థిక పరిపుష్టికి తోడ్పడిన ఈ రంగాలు మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి పునాదిగా నిలిచాయి. వినియోగదారులు, వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు కొనుగోలు శక్తి కోల్పోవడం ద్వారా ఆర్థిక సంక్షోభం వచ్చిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థికమాంద్యం గత డ్బ్భై ఏండ్లలో ఎప్పుడు లేదని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అభిప్రాయపడినాడు.


ప్రస్తుతం ఉన్న ఆర్థికమాంద్యం గత డ్బ్భై ఏండ్లలో ఎప్పుడు లేదని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ అభిప్రాయపడినాడు. గత 15 ఏండ్లలో ప్రైవేట్‌రంగంలో ఇంత తక్కువగా ఎప్పుడు పెట్టుబడులు పెట్టడం జరుగలేదు. చిన్న పరిశ్రమలకు జీఎస్టీ గుదిబండగా మారింది. జీఎస్టీ నిబంధనలు కష్టతరంగా మారి చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిబంధనల ప్రకారం మార్కెట్లో పెట్టలేకపోయాయి. ఫలితంగా వారి వస్తువులు కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండాపోయాయి.


గత 15 ఏండ్లలో ప్రైవేట్‌రంగంలో ఇంత తక్కువగా ఎప్పుడు పెట్టుబడులు పెట్టడం జరుగలేదు. చిన్న పరిశ్రమల కు జీఎస్టీ గుదిబండగా మారింది. జీఎస్టీ నిబంధనలు కష్టతరంగా మారి చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిబంధనల ప్రకారం మార్కెట్లో పెట్టలేకపోయాయి. ఫలితంగా వారి వస్తువులు కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండాపోయాయి. స్థూల ఉత్పత్తి పెరుగుదల 5 శాతానికి పడిపోయింది. సుబ్రహ్మణ్యస్వామితో సహా అనేకమంది ఆర్థికవేత్తలకు మోదీ ప్రభుత్వ జీడీపీ లెక్కలపై అనేక అనుమానాలున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి ప్రకారం జీడీపీ పెరుగుదల 3.5 శాతం. కార్ల పరిశ్రమ సంక్షోభం వల్ల పది లక్షల ఉద్యోగాలు పోయాయి. గృహ నిర్మాణ పరిశ్రమ కుప్పకూలిపోయింది. బనియన్లు, డ్రాయర్లు ఉత్పత్తిచేసే పరిశ్రమలు కూడా డిమాండ్లకే మూతపడుతున్నాయి. ఇదే పరిస్థితి అనేక రంగాలలో నెలకొని ఉన్నది. 2011-2014 మధ్యన వినియోగదారుల కొనుగోలు శక్తి సూచిక 6.1 శాతం ఉండగా, ఇప్పుడు అది 3.1 శాతానికి పడిపోయింది. ఆదాయం లేక ప్రజలు వస్తువులు కొనలేకపోవడం, డిమాండ్ లేక పరిశ్రమలు కార్మికులను తొలిగించి ఉత్పత్తిని తగ్గించుకోవడం, నిరుద్యోగులైన కార్మికులు వస్తువులను కొనుగోలు శక్తి కోల్పోవడమనేది ఒక విషవలయం. ఈ విష వలయం నుంచి బయటపడటానికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఆర్థికపరిస్థితి తీవ్రంగా దిగజారినప్పుడు మాత్రమే బిస్కెట్లు, బనియన్లు, డ్రాయర్లు విలాస వస్తువులుగా మారుతాయి. ఈ పరిస్థితి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి సూచిక. నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల వచ్చే ఆర్థికమాంద్యం 1929లో అమెరికాలో వచ్చింది. అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ఆర్థిక శాస్త్రవేత్త కీన్స్ సూచనలతో ఆర్థికమాంద్యం నుంచి బయటపడటానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 15 శాతం, ప్రభుత్వ ఖర్చులు 25 శాతం తగ్గించాడు. నిధులను వ్యవసాయంపై, రైల్వే లైన్లపై, రహదారుల నిర్మాణంపై, చిన్న పరిశ్రమలపై, ఉద్యోగకల్పన పథకాలపై ఖర్చుపెట్టాడు. ఫలితంగా అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడింది.

దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మోదీ తాత్త్విక ఆలోచనల్లోనే లోపం ఉన్నది. 2015లో వ్యవసాయదారుల భూమి హక్కును హరించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 2016, నవంబర్‌లో ప్రజల డబ్బును బలవంతంగా బ్యాంకుల్లో సమీకరించే విషయంలో విజయం సాధించాడు. జీఎస్టీ ప్రవేశపెట్టి ట్రాక్టర్ టైర్లపై కూడా 18 శాతం టాక్స్ విధించి రైతుపై అదనపు భారాన్ని మోపాడు. ప్రజల దగ్గర డబ్బులను తీసుకొని పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యవ్యవస్థలో ఊహించని విషయం. కుహనా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం
ఇంతగా తహతహలాడే ప్రధాని దేశ చరిత్రలో లేడు.


డిమాండ్ లేక పరిశ్రమలు ఉత్పత్తిని ఆపుతున్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ, దెబ్బతిన్న రంగాలను వదిలేసి నష్టపోని బడా పారిశ్రామిక వేత్తలకు రూ.1.45 లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ప్రభుత్వం ఇచ్చింది. పారిశ్రామికవేత్తలకు ఉదారంగా అప్పులు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. రిజర్వు బ్యాంక్ నుంచి వచ్చిన రూ.1.7 లక్షల కోట్లను బడా పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నది. ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ఆర్థికశాస్త్రవేత్తల సూచనలు పాటించాల్సిన ప్రభుత్వం పారిశ్రామికవేత్తల సూచనలతో దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఈ క్లిష్ట సమయంలో వారికి మేలుచేసే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రధాని ఆర్థిక సలహాదారులు మండలం నుంచి రాతిన్‌రాయ్, శామిక రవిలను వాస్తవాలు చెప్పినందుకు తొలిగించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు చెందాల్సిన డబ్బును పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం జరిగింది. 3.8 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన అంబాని తదితర పెట్టుబడిదారులకు పరిశ్రమలు విస్తరించడానికి, నెలకొల్పడానికి మూలధనం కొరత లేనప్పుడు కార్పొరేట్ టాక్స్ మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో మందగమనం సూచనలు వచ్చినప్పుడు జాతీయ రహదారులపైన ఖర్చుపెట్టడం జరిగింది. మన్మోహన్‌సింగ్ సమయంలో రోజ్‌గార్ యోజన పథకం ద్వారా గ్రామాలకు నిధులు తరలించడం జరిగింది. వేలాదిమందికి పనికల్పిస్తూ తెలంగాణలో ఐదు కోట్ల మందికి మంచినీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథకు, బీడు భూములకు నీటిని తరలిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కపైసా ఇవ్వని ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు విరివిగా సహాయం చేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రూ.1.45 లక్షల కోట్లను, రిజర్వు బ్యాంక్ నుంచి తీసుకుంటున్న రూ.1.7 లక్షల కోట్లను దేశంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై, రహదారుల నిర్మాణంపై, మంచినీటి పథకాలపై, వ్యవసాయరంగంపై, చిన్న పరిశ్రమల పునరుద్ధరణపై పెట్టినట్లయితే ఆర్థికమాంద్యం నుంచి బయటపడే అవకాశాలుండేవి.

మోదీ అభిమాన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కార్పొరేట్ టాక్స్ కట్ ప్రవేశపెడుతూ ఫలితాలు వివిధ మార్గాల్లో కార్మికులకు చేరుతాయని చెప్పాడు. కార్మికుల జీతాలు సరాసరి 4 వేల డాలర్ల వరకు జీతాలు పెరిగి ప్రతి కుటుంబం ఆదాయం 9 వేల డాలర్ల వరకు పెరుగవచ్చని చెప్పాడు. అర్ధ శాస్త్ర సిద్ధాంత ఆధారాల్లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కాకి లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. ట్రంప్ చెప్పినట్టుగా ఏమీ జరుగకపోగా దేశ ఆర్థికలోటు పెరిగింది. మధ్యతరగతి ప్రజలు సగటున నాలుగు వేల డాలర్లు ఎక్కువగా టాక్స్ చెల్లించారు. పన్ను మినహాయిం పు వల్ల లాభం పొందినవాళ్ల నుంచి ఇప్పుడు ఎన్నికల నిధులను వసూ లు చేస్తున్నాడు. అమెరికా అనుభవం చెప్పేదేమంటే బడా పారిశ్రామికవేత్తలకు చేసే సహాయం ఎన్నికల్లో నిధుల సమీకరణకు ఉపయోగించుకోవడం. పారిశ్రామిక పునరుద్ధరణకు టాక్స్ మినహాయింపు ఇచ్చామని నిర్మలా సీతారామన్ చెప్పేవన్నీ కట్టుకథలే. మేక్ ఇన్ ఇండియా పథకం నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. ప్రతి భారతీయుడు సగటున రూ.6 వేల విలువైన చైనా వస్తువులను ప్రస్తుతం వాడుతున్నాడు. 2014లో ఈ వాడకం రూ.3 వేలు మాత్రమే ఉండేది. భార త ఉత్పత్తిరంగం బలహీనపడి చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు. చాలా వెనుకబడిన దేశాలైన బంగ్లాదేశ్, వియెత్నాం దేశాలు ఎక్కువగా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధా న్యం ఇచ్చే మోదీ తాత్త్విక ఆలోచనలలోనే లోపం ఉన్నది. 2015లో వ్యవసాయదారుల భూమి హక్కును హరించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 2016, నవంబర్‌లో ప్రజల డబ్బును బలవంతంగా బ్యాంకుల్లో సమీకరించే విషయంలో విజయం సాధించాడు.
m-nagendhar
జీఎస్టీ ప్రవేశపెట్టి ట్రాక్టర్ టైర్లపై కూడా 18 శాతం టాక్స్ విధించి రైతుపై అదనపు భారాన్ని మోపాడు. ప్రజల దగ్గర డబ్బులను తీసుకొని పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊహించని విషయం. కుహనా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ఇంతగా తహతహలాడే ప్రధాని దేశ చరిత్రలో లేడు. మోదీ విధానాలు పేద, ధనిక వర్గాల మధ్య అంతరాన్ని పెంచుతూ, మధ్యతరగతి వర్గాన్ని పేదరికంలోకి నెట్టుతూ, మత భావాలను రెచ్చగొడుతూ, పారిశ్రామికవర్గాలకు మేలు చేకూరుస్తున్నాయి. యువతను నిరుద్యోగంలోకి నెట్టిన ఆర్థికమాంద్యం రాజకీయాల్లో కూడా పెను మార్పులను తీసుకొస్తుంది.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్ డీసీ)

619
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles