వాస్తవాలు పట్టని కమ్యూనిస్టులు


Wed,October 16, 2019 10:13 PM

సమాజంలో మార్పులు సహజ పరిణామక్రమంలో రావటం (ఎవొల్యూషన్‌) ఒక పద్ధతి అయితే, సమాజంలోని కొన్ని శక్తుల అసాధారణ వత్తిడి వల్ల అసాధారణమైన మార్పులు రావటం (రివల్యూషన్‌) మరొక పద్ధతి. వీటిలో దేనికైనా ఆధారం వాస్తవ పరిస్థితులే. ఫ్రెంచ్‌ విప్లవం వంటి బూర్జువా విప్లవమైనా, పారిశ్రామిక విప్లవం వంటి వస్తుపర విప్లవమైనా, రష్యా-చైనాల వంటి వామపక్ష సైద్ధాంతిక విప్లవాలైనా అన్నిటికీ ఇది వర్తిస్తుంది. వాస్తవ పరిస్థితులకు ఆయా శక్తుల ఆచరణ తగువిధంగా తోడవ్వాలి. ఇది తెలంగాణ కమ్యూనిస్టులకు అర్థం కావటం లేదు.

తెలంగాణ కమ్యూనిస్టులకు అస్పష్టతలు, డైలమాలు ఇం కా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకముందు రైతాంగ పోరాట కాలం నుంచే మొదలయ్యాయి. అప్పటినుంచి ఈ సరి కి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. రైతాంగ పోరాటం కొద్దికాలం సాగినాక దానిని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలు రావటంతో, పోరాటాన్ని కొనసాగించటం సరైనదా లేక విరమించటమా అనే డైలమా ఎదురైంది. ఆ డైలమాకు కారణం తెలంగాణలోని వాస్తవ పరిస్థితులా లేక కేంద్ర బలగాలను తాము తట్టుకొనలేకపోవటమా? చివ రికి కొందరు పోరాటాన్ని విరమించగా, కొందరు కొనసాగించి ఓడిపో యారు. భారతదేశ వాస్తవాలపై, సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితుల పై వారి అస్పష్టతలు, డైలమాలు అప్పటినుంచే మొదలై ఇప్పటికీ కొన సాగుతున్నాయి. ఇవి ఆ తర్వాతకాలంలో మితవాద, అతివాద, తీవ్రవా ద, అతి తీవ్రవాద రూపాలలో అనేక చీలికలకు దారితీశాయి. సిద్ధాంతం ఒకటే అని చెప్పినా పరిస్థితులపై భిన్నమైన అవగాహనలు, ఆచరణపై భిన్న వ్యూహాలు ఉండటం సహజం. కానీ అవన్నీ చివరకు ఎక్కడికి దారి తీశాయి, ఎటువంటి పరిస్థితి సృష్టించాయి అన్నది కమ్యూనిస్టులకు ఎం త ముఖ్యమవుతున్నదో తెలియదు గాని, సాధారణ ప్రజానీకానికి మాత్రం తప్పకుండా ముఖ్యమైన విషయమే. దానినిబట్టే వారు కమ్యూ నిస్టుల పట్ల తమ వైఖరిని నిర్ణయించుకుంటారు. ఈ రోజున తెలంగా ణలో జరుగుతున్నది అదే. మొత్తం దేశంలోనూ అదే జరుగుతున్నది.

వీరి రెండవ ప్రధానమైన డైలమా బ్రిటిష్‌ పాలకుల నిష్క్రమణతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా లేదా అన్నది. వలసపాలన పోవటం దేశంలో సాధారణ ప్రజల సంతోషానికి కారణమైంది. బయటివారి దోపి డీ, అణిచివేతలకు వ్యతిరేకంగా అన్నివర్గాల ప్రజలు వందల సంవత్సరా ల పాటు పోరాడిన నేపథ్యంలో 1947 నాటి మార్పు ప్రజలకు ఒక పెద్ద మార్పుగా కన్పించటం సహజం. కానీ కమ్యూనిస్టులలో కొందరు అస లేమీ మారలేదనగా, కొందరు పరిమితమైన మార్పు వచ్చిందన్నారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా అతివాద ఆదర్శపు వాదనలు చేయటం తో, వీరిమధ్య తదనంతరకాలపు చీలికలకు, బలహీనతలకు, వైఫల్యాల కు ఇదొక ముఖ్య కారణమైంది. ఇవే ప్రభావాలు తెలంగాణలోనూ ఉన్నా యి. వాస్తవ పరిస్థితులు ఏమిటన్నదానిపై ఎవరి అవగాహనలు వారికి ఉండటం సహజం గనుక అందులో ఆక్షేపించదగినది ఏమీలేదు గాని, ఆయా పరిస్థితులపై సాధారణ ప్రజాభిప్రాయం ఏమిటన్నది కూడా ఒక పరిశీలనాంశం అయితీరాలి. అట్లా కాకపోవటంలో అవివేకం చాలా ఉం టుందని కమ్యూనిస్టులకు అప్పటినుంచి ఈ రోజువరకు అనిపించినట్లు తోచదు.

ఇటువంటి మరొక డైలమా లేదా వాదోపవాదం భారతీయ వ్యవస్థ స్వభావం ఏమిటన్న దానిచుట్టూ తిరుగుతూ వస్తున్నది. మనది భూస్వా మ్యమా? అర్థ భూస్వామ్యమా? వలసా? అర్థ వలసా? పెట్టుబడి దారీ యా? బూర్జువానా? కాంప్రడార్‌ బూర్జువానా? వీటిలో ఏవైనా రెండో-మూడో సగాలు కలిసి ఉన్నాయా? వీటిలో ఈ దశ నుంచి ఏ దశకు మార్పు సిద్ధిస్తున్నది? ఏయే శక్తులు దేశభక్తి గలవైతే ఏవి దేశద్రోహకర మైనవి? వీటిలో ఏ శక్తులతో కలిసి విప్లవం కోసం పనిచేయాలి? ఇటు వంటివే ఇంకా ఛప్పన్నారు ప్రశ్నలు. 70 ఏండ్లు గడిచినా తేలనివి. తాము ఏమి చేయాలో, తాము బూర్జువాలు అనే ఇతర పార్టీలతో కలిసి ఏమి చేయాలో సీపీఐ, సీపీఎంలకు అర్థం కాని ప్రశ్నలు. విప్లవకారులకు అంతే తేలని ప్రశ్నలు. రోజురోజుకు ఇంకా పెరుగుతున్న ప్రశ్నలు.

1956 నుంచి 2014 వరకు తెలంగాణలోని వాస్తవాలు, పరిణామాలు ఏమిటో, ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీల అవాస్తవిక వైఖరులు ఏమి టో వివరమైన పరిశోధన ఏదీ ఇంతవరకు జరుగలేదు. రైతాంగ పోరాటం తర్వాత ఇక తెలంగాణ అనేదిగాని, తెలంగాణ ప్రజలు అనేవారు గాని, తమ పాత్ర గాని అంటూ ఏమైనా ఉంటే ప్రత్యేక రాష్ట్రవాదన-సమైక్య వాదన అనే దాని చుట్టూ మాత్రమే తిరిగినట్లు ఉభయ కమ్యూ నిస్టులు భావిస్తారు. చివరికి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి దృష్టి ఇక్క డి వాస్తవాలపై, ప్రజల అభిప్రాయాలూ ఆకాంక్షలపై, భవిష్యత్తు అభివృ ద్ధిపై ఉండాలి. వందల ఏండ్లుగా రకరకాల పీడనలకు గురై, ఆరాటపడి ఉద్యమాలు సాగించిన ప్రజలు వర్తమానంలో ఏమి ఆలోచిస్తున్నారనేది గమనికలోకి తీసుకోవాలి.


వీటన్నింటి మధ్యనుంచి క్రమంగా సాధారణమైన అభిప్రాయం ఒకటి ఏర్పడుతున్నది. ఈ చివరి నుంచి ఆ చివరికి గల కమ్యూనిస్టులలో ఎవరి కి దేనిపట్ల స్పష్టత లేదు. అన్నీ డైలమాలే. ఎవరికి దేనిపట్లనైనా సరైన అధ్యయనం లేదు. పడికట్టు మాటలు, డైలాగులు తప్ప ఇటు తమ సిద్ధాంతాలను గాని, అటు భారతదేశ చరిత్ర-సమాజం-ఆర్థిక-సామాజి క-రాజకీయ-సాంస్కృతిక విషయాలను గాని, వర్తమాన వాస్తవాలను గాని చిత్తశుద్ధితో అధ్యయనం చేయరు. ఆయా విషయాలపై సాధారణ ప్రజలకు పెత్తందారీ ధోరణిలో బోధనలు చేయటం మినహా, వారు తమ ను గుడ్డిగా అనుసరించాలని భావించటం మినహా, ఆ ప్రజలకు తమ జీవితానుభవాల నుంచి కలిగిన అవగాహనలు ఉంటాయనుకోరు. అవే మిటో తెలుసుకొనజూడరు. వాటిని తమ సైద్ధాంతిక అవగాహనలతో, ఆచరణ వ్యూహాలతో జోడించరు. వీరికి రష్యా, చైనాల గురించి పూసగు చ్చినట్లు సమస్తం తెలుసునుగాని, తమ భారతదేశం గురించి అదేవిధమై న అధ్యయనాలు చేయరు. చేయటం అవసరమనే వారిని ఈసడిస్తారు. మార్క్సియన్‌ సిద్ధాంతకర్తల నుంచి, రష్యా-చైనా విప్లవాల నుంచి కొటే షన్లతో బెదరగొట్టి నోరుమూయిస్తారు. ఇటువంటి అనేకానేకం అన్నీ కలి సి భారతదేశపు కమ్యూనిస్టులను ప్రస్తుతం మనం చూస్తున్న దుస్థితికి తెచ్చాయి.

తెలంగాణ పరిస్థితి ఇందుకు భిన్నమైనది కాదు. రైతాంగ పోరాటం నాటి పరిణామాలు ఏమిటన్నది ఒక మౌలికమైన నేపథ్య తెరవంటిది. ఆ తర్వాత కాలానికి వస్తే, ఇక్కడి సాధారణ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కేంద్రం నియమించిన ఫజల్‌ అలీ కమిషన్‌ స్వయంగా పేర్కొన్నది. అందుకు కారణాలను కూడా చెప్పిం ది. అప్పటికే ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతీ యులు తమపై ఆధిపత్యం నడుపగలరనే భయాలు ఉన్నాయన్నది. అయినప్పటికీ కమ్యూనిస్టులు ఇటువంటి ప్రజాభిప్రాయం, వాస్తవాలు ముఖ్యమనుకున్నా రాలేక సీమాంధ్ర ధనికుల ప్రయోజనాలు, తమ గుడ్డి భాషాసిద్ధాంతం (అది చెల్లనిదని తమ గురువు స్టాలిన్‌ అప్పటికే ప్రకటించాడు) ముఖ్యమనా? వాస్తవాలతో, ప్రజాభిప్రాయంతో నిమి త్తం లేని వీరి ఈ వైఖరి 1956 తర్వాత కూడా కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతున్నది. అందువల్లనే తెలంగాణ శాసనసభలో వరుసగా రెం డుసార్లు కనీస ప్రాతినిధ్యాన్ని అయినా తమ వీరోచిత రైతాంగపోరాట చరిత్ర ఇవ్వలేకపోయింది. మొదటి సభలో గెలిచిన ఏకైక సభ్యుడు సైతం నిలువని స్థితికి కూడా ఈ వైఫల్యాలే కారణం.

1956 నుంచి 2014 వరకు తెలంగాణలోని వాస్తవాలు, పరిణామా లు ఏమిటో, ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీల అవాస్తవిక వైఖరులు ఏమి టో వివరమైన పరిశోధన ఏదీ ఇంతవరకు జరుగలేదు. రైతాంగ పోరా టం తర్వాత ఇక తెలంగాణ అనేదిగాని, తెలంగాణ ప్రజలు అనేవారు గాని, తమ పాత్ర గాని అంటూ ఏమైనా ఉంటే ప్రత్యేక రాష్ట్రవాదన-సమైక్య వాదన అనే దాని చుట్టూ మాత్రమే తిరిగినట్లు ఉభయ కమ్యూ నిస్టులు భావిస్తారు. చివరికి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి దృష్టి ఇక్క డి వాస్తవాలపై, ప్రజల అభిప్రాయాలూ ఆకాంక్షలపై, భవిష్యత్తు అభివృ ద్ధిపై ఉండాలి. వందల ఏండ్లుగా రకరకాల పీడనలకు గురై, ఆరాటపడి ఉద్యమాలు సాగించిన ప్రజలు వర్తమానంలో ఏమి ఆలోచిస్తున్నారనేది గమనికలోకి తీసుకోవాలి. కమ్యూనిస్టులకు తమ సిద్ధాంతాలు, లక్ష్యాలు తమకు ఉండటంలో అభ్యంతరం చెప్పదగింది లేదు. కానీ ఆ ప్రకారం సాగించే తమ ఆచరణకు, ప్రజల ఆలోచనలకు, అభివృద్ధి అవసరాలకు మధ్యదూరం ఎంత పెరిగితే, తమకు-ప్రజలకు మధ్య దూరం కూడా అంతగా పెరుగుతుంది. 1956 నుంచి 2 014 వరకు, ఆ తర్వాత కూడా అట్లా పెరుగుతూ వస్తున్నది కనుకనే తెలంగాణ కమ్యూనిస్టులు ఇంత దయనీయ స్థితిలో ఉన్నారు. దానిని తగ్గించుకుంటారా?

ashok

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles