వందే మాతరం

Thu,August 15, 2019 01:00 AM

indian-national-flag
త్రివర్ణ పతాకం ఎగిరింది
నీలి నింగిలో మెరిసింది
భారతీయతను జగతికి చాటగ
స్వేఛ్ఛగ రెపరెపలాడింది
వందే మాతరం.. వందేమాతరం..
కృష్ణార్జునులే రథ సారథులుగ
భగవద్గీతను బోధించింది
సకల మతములకు సమత్వమిచ్చి
లౌకిక బాటన నడిచింది
స్వతంత్రయోధుల బలిదానాలకు
ప్రతీకగా వెలుగొందింది
వందే మాతరం.. వందేమాతరం..
రైతు రాజుగ మారే వరకు
కంకణబద్ధురాలయింది
బడుగుల బతుకులు బాగు పర్చగా
చిత్తశుద్ధితో మెలిగింది..
ప్రజాక్షేమమే పరమార్థమ్మని
త్రికరణముల నెరనమ్మింది
వందే మాతరం.. వందేమాతరం..
దేశదేశములకు ఆదర్శంగా
విదేశాంగమే నెరిపింది
దురాక్రమణల ఇరుగుపొరుగుల
గుణపాఠాలే నేర్పింది
జనగణమన అధినాయక గీతం
లోకమంతటికి మేల్కొల్పయింది
వందే మాతరం.. వందేమాతరం..
-గొల్లపెల్లి రాంకిషన్, 9849693324

162
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles