మట్టి విగ్రహాలే మేలు

Fri,August 23, 2019 11:26 PM

ఒకప్పుడు వినాయక చవితి సందడి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రోజుల నుంచి 20 రోజుల వరకు సాగుతున్నాయి. మనదేశంలో గణేష్ నిమజ్జనం ఒక ప్రధాన ఘట్టంగా మారింది. ఒకప్పుడు వినాయక ప్రతిమలను మట్టితో తయారుచేసి పసుపు, కుంకుమలతో పాటు సహ జ సిద్ధమైన రంగులు, ఫలాలతో పూజించే సాంప్రదాయం మన దేశంలో ఉండేది. ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేసే విధానం మొదలైంది. రసాయనాలతో చేసిన విగ్రహా లను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా జలాశయాలు కూడా కలుషితమ వుతున్నాయి. ఫలితంగా జలచరాలకు కావలసినంత ఆక్సీజన్ అందక అవి చనిపోతున్నాయి. నీటిలో మట్టి విగ్రహాలు కరిగినంత తొందరగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు కరుగవు. అందువల్ల చెరువులు, కాలువలు, నదుల్లో విగ్రహాల ఆనవాళ్లు చాలాకాలం పాటు పేరుకు పోయి చెరువులు, కాలువలు, నదులు, డ్యామ్‌లు పూడికతో తొందరగా నిండిపోతాయి.

తద్వారా నీటి నిల్వ తక్కువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విగ్ర హ నిమజ్జనం సందర్భంగా పెద్దఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తుంటారు. ఈ డప్పు, వాయిద్యాల శబ్ద కాలు ష్యం పెరుగడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురౌతుంటారు. హైదరాబాద్ వంటి నగరాల్లో విగ్రహ నిమజ్జనాలకు దాదాపు రెండు రోజుల సమయం పడుతున్నది. పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవటమంటే దాని అర్థం భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు భావించరాదు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టి విగ్రహాలను వాడేవిధంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి. రసాయనాలతో విగ్రహాలను తయారుచేసే కార్మికులకే మట్టి విగ్రహాలను తయారుచేసే పని అప్పగిస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. ఈ దిశగా పాలకులు, వినాయక ఉత్సవ నిర్వాహకులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
- యం.రాంప్రదీప్, సామాజిక కార్యకర్త

132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles