జపాన్‌లో 400 విమానాల రద్దు

Mon,September 23, 2019 02:48 AM

టోక్యో: తపాహ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తుండటంతో జపాన్‌ దేశీయంగా 400కి పైగా విమానాలను రద్దుచేసింది. తుఫాన్‌ ప్రభావంతో గంటకు 162 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని జపాన్‌ వాతావరణశాఖ తెలిపింది. నాగసాకికి సమీపాన తుఫాన్‌ తీరాన్ని తాకవచ్చునని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ సోమవారం ఉత్తర జపాన్‌ మీదుగా తీరాన్ని దాటొచ్చునని తెలుస్తున్నది. ఇప్పటికే ఒకినావా ప్రాంతంలో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

440
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles