పాక్‌పై ద్వేషాన్ని పెంచి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు

Sat,March 23, 2019 02:42 AM

Ahead Of Pakistan National Day Imran Khan Tweets PM

-మోదీ సర్కార్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపణ
- భారత్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు
- సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
ఇస్లామాబాద్, మార్చి 22: పాకిస్థాన్‌పై ద్వేషపూరిత రాజకీయాలతో భారత్‌లో ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నదని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రవాద సంస్థలపై చర్యలు చేపట్టాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వివిధ పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి భద్రతకు ముప్పు పొంచి ఉన్నదని చెప్పారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జాతిని, సైనిక బలగాలను కోరారు. పాకిస్థాన్‌లో జిహాదీ సంస్థలకు, ఆ సంస్కృతికి చోటు లేదని పేర్కొన్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలను తుదముట్టించేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి యుద్ధం సాగినప్పటి నుంచి జిహాదీ సంస్థల ఉనికి ఉన్నదన్నారు.

223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles