నకిలీ వర్సిటీల పట్ల అప్రమత్తం

Fri,April 12, 2019 12:26 AM

Alert to fake varsities

-భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లపై అమెరికా అధికారుల సూచన
వాషింగ్టన్, ఏప్రిల్ 11: ఉన్నత విద్యాకోర్సుల్లో చేరేందుకు అమెరికాకు వచ్చే భారతీయ వి ద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా, చురుగ్గా వ్యవహరించాలని అమెరికా అధికారులు అడ్వైజరీ (సూచన) జారీ చేశారు. భారతీయ విద్యార్థులు పలు అంశాలను, ప్రత్యేకించి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్ప ష్టం చేశారు. గత జనవరిలో పే టు స్టే వీసా రాకెట్‌లో ఒక నకిలీ వర్సిటీలో పేర్లు నమోదు చేసుకున్న 129 మంది భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు వర్సిటీ ఒక క్యాంపస్ నుంచే నడుస్తున్నదా? పరిపాలనా విభాగంలోనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారా? లేదా? వివిధ పాఠ్యాంశాలను బోధించేందుకు ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఇన్‌స్ట్రక్టర్లు/ బోధకులు ఉన్నారా? యూనివర్సిటీల్లో సరైన విద్యా ప్రణాళిక, రెగ్యులర్ తరగతుల బోధన, చురు గ్గా అకడమిక్, బోధన సాగుతున్నదా? లేనిపక్షంలో ఆ వర్సిటీల్లో చేరకుండా ఉండటమే సరైన చర్య అని అడ్వైజరీలో పేర్కొన్నారు.

264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles