బ్రిటన్‌లో మసీదులపై దాడి

Fri,March 22, 2019 03:09 AM

Birmingham mosque attacks probed by counter terrorism officers

అద్దాలు ధ్వంసం.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
లండన్, మార్చి 21: ముస్లింలపై బ్రిటన్‌తోపాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ద్వేషం పెరుగుతున్నది. గతవారం న్యూజిలాండ్‌లోని క్రెస్త్‌చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఆస్ట్రేలియాకు చెందిన ముష్కరుడు దాడి జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అర్థరాత్రి బ్రిటన్ నగరం బర్మింగ్‌హంలోని ఐదు మసీదులపై స్వల్పస్థాయి దాడులు జరిగాయి. న్యూజిలాండ్‌లో మసీదులపై దాడికి, బర్మింగ్‌హం నగరంలోని మసీదులపై దాడి ఘటనకు సంబంధం ఉన్నదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ మిడ్‌లాండ్ పోలీసులు చెప్పారు. బర్చ్‌ఫీల్డ్ రోడ్డులోని జమే మసీదు కిటికీ అద్దాలను సుత్తితో పగులగొట్టినట్లు తమకు సమాచారం అందిందని, కొద్ది సేపటికే ఎర్డింగ్టన్ ప్రాంతంలోని మరో మసీదుతోపాటు ఇతర ప్రాంతాల్లోని మసీదులపైనా ఇటువంటి దాడులే జరిగాయని తెలిపారు. తదుపరి దాడులు జరుగకుండా పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీస్ అండ్ క్రైమ్ కమిషనర్ డేవిడ్ జమైసన్ స్పందిస్తూ.. ఇటువంటి ద్వేషపూరిత దాడులకు మన సమాజంలో చోటు లేదు. వాటిని సహించే ప్రసక్తే లేదు అని చెప్పారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles