ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Fri,November 15, 2019 01:05 AM

గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ఫలించినట్టు పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ జిహాద్ తెలిపింది. అయితే, దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. గురువారం ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో పాలస్తీనా కుటుంబానికి చెందిన ఆరుగురు, గాజా కమాండర్ మరణించారు. దీంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.


కేబీసీ కరమ్‌వీర్‌గా అచ్యుత సమంత
ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)లో కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కేఐఎస్‌ఎస్), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అచ్యుత సమంత పాల్గొననున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వనున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కరమ్‌వీర్ స్పెషల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ చానెల్‌లో ప్రసారం కానుంది. ఈ షోలో అచ్యుత సమంతతోపాటు ఆయన సోదరి డాక్టర్ ఐతిరాణి సమంత, నటి తాప్సీ కూడా పాల్గొననున్నారు. బాల్యంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, విద్యావేత్తగా ఎదిగిన తీరుపై అచ్యుత సమంత మాట్లాడనున్నట్లు సమాచారం.

694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles