మసూద్‌పై నిషేధానికి చైనా చెక్

Thu,March 14, 2019 02:39 AM

China blocks effort at UN to ban Jaish chief Masood Azhar

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుపుల్ల
ఐరాస, మార్చి 13: పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం మసూద్ అజర్‌పై నిషేధం విధించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన ప్రతిపాదనను సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అడ్డుకుంది. భద్రతా మండలికి చెందిన 1267 అల్‌కాయిదా ఆంక్షల కమిటీ పరిధిలో అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా గత నెల 27న ప్రతిపాదించాయి.పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది జరిపిన దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. భద్రతా మండలికి ప్రతిపాదన వచ్చిన పది పని దినాలలో ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే, అది అమలులోకి వస్తుంది. అజర్‌పై నిషేధం ప్రతిపాదనకు బుధ-గురువారాల మధ్య రాత్రి 12.30 గంటలకు గడువు ముగియనుండగా, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో చైనా తన నిర్ణయాన్ని వెల్లడించింది.

578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles