చైనాలోని రసాయన కర్మాగారంలో పేలుడు..

Fri,March 22, 2019 03:06 AM

China chemical plant explosion kills six in Yancheng

-ఆరుగురు మృతి
-30మందికిపైగా గాయాలు

బీజింగ్: చైనాలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురువారం యాన్‌చెంగ్ జియాంగ్‌సూ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్క్ (పారిశ్రామిక వాడ) ప్రాంతంలో చోటుచేసుకుంది. బెంజిన్ అనే రసాయనం వల్లనే ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తున్నది.

ఈజిప్టులో 10 మంది మృతి

ఈజిప్టులోని ఓ రసాయనాల ప్లాంట్ వద్ద పేలుడు సంభవించడంతో 10 మంది మరణించారు. ఈ దుర్ఘటన గురువారం ఎర్ర సముద్రం తీరప్రాంతం వెంట ఉన్న ఏయిన్ సోక్నా ప్రాంతంలో చోటుచేసుకుంది. పేలుడు విషయాన్ని అధికారులు ప్రకటించకపోయినప్పటికీ స్థానిక మీడియా మాత్రం ధ్రువీకరించింది. ఏయిన్ సోక్నా ప్రాంతంలో పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి.

322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles