రేపు జిన్‌పింగ్‌ రాక

Thu,October 10, 2019 03:05 AM

- రెండ్రోజులపాటు భారత్‌ పర్యటన
- ప్రధాని మోదీతో సమావేశం కానున్న చైనా అధ్యక్షుడు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుక్ర, శనివారాల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సమకాలీన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వీరు చర్చించనున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా చెన్నై సమీపంలోని మామల్లాపురం ప్రాంతంలో భారత ప్రధాని మోదీతో సమావేశమవుతారు’ అని తెలిపారు. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ మధ్య జరుగనున్న భేటీ వారిద్దరి మధ్య జరిగే రెండో అనధికార సమావేశమని, ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారని పేర్కొంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మంగళవారం ఆ దేశ ప్రధాని లీ కిక్వ్యాంగ్‌తో సమావేశమయ్యారు. ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేయడం.. దానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్న ఇమ్రాన్‌ చైనా పర్యటనలో ఉండటం.. ఇదే సమయంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles