ఆస్ట్రేలియాలో నైట్‌క్లబ్ బయట కాల్పులు

Mon,April 15, 2019 01:08 AM

Fire outside the nightclub in Australia

-ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
మెల్‌బోర్న్, ఏప్రిల్ 14: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మరోసారి కాల్పులు ఘటన కలకలం రేపింది. ఓ నైట్‌క్లబ్ బయట జరిగిన కాల్పు ల్లో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రహరాన్ నగర శివారులోని ట్రెండి ఇన్నర్‌సిటీలో ఓ నైట్‌క్లబ్ బయట ఆదివారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని దవాఖానకు తరలించగా ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయారని, మరో ముగ్గురు చికిత్స పొందుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. వారి వయస్సు 29 నుంచి 50 ఏండ్ల మధ్య ఉంటుందని వెల్లడించారు. ఈ ఘటనకు ఉగ్రవాదానికి సంబంధం లేదని వెల్లడించారు.

253
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles