‘హౌడీ మోదీ’కి ట్రంప్‌ ఎందుకు హాజరయ్యారంటే..

Mon,September 23, 2019 02:56 AM

హ్యూస్టన్‌: అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాజకీయ ఉద్దేశంతోనే హాజరైనట్టు భావిస్తున్నారు. ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రంప్‌ హాజరు కావడానికి ప్రధాన కారణం.. వచ్చే ఏడాది అమెరికాలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలే. ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి ఎంచుకున్న వేదిక టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసిస్తారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉన్న హ్యూస్టన్‌, డల్లాస్‌ ప్రాంతాలు కూడా టెక్సాస్‌ పరిధిలోనివే. నేషనల్‌ ఏషియన్‌ అమెరికన్‌ సర్వే ప్రకారం.. 2016 అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో ట్రంప్‌ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇక్కడి ప్రవాస భారతీయులు అధికంగా(హిల్లరీకి 77 శాతం, ట్రంప్‌కు 16 శాతం) మద్దతునిచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే, రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓటు బ్యాంకును చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే ట్రంప్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.

454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles