భారత ఎన్నికలపై ఇమ్రాన్ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది: పాక్

Fri,April 12, 2019 01:23 AM

Imran Khans statement on Modi polls result taken out of context

ఇస్లామాబాద్: భారత్‌లో ఎన్నికల ఫలితాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని మీడియా సంచలనం చేసిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి పేర్కొన్నారు. గురువారం ఖురేషీ పాక్ విదేశాంగశాఖ సెనెట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ పట్ల ఇమ్రాన్‌ఖాన్‌కు గల అభ్యంతరాలు అందరికీ తెలిసిన అంశమేనన్నారు. భారత్ మీడియా ప్రతి అంశాన్ని సంచలనం చేస్తున్నదని ఖురేషీ ఆరోపించారు. ఇమ్రాన్‌ఖాన్ విదేశీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ గెలుపొందితేనే కశ్మీర్ అంశం పరిష్కారం అవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే.

692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles