చర్చల ద్వారా పరిష్కరించుకుందాం

Sat,June 8, 2019 02:50 AM

Imran writes to PM Modi says Pakistan wants talks with India to resolve all disputes

-మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ
ఇస్లామాబాద్: కశ్మీర్‌తోపాటు అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం లేఖ రాశారు. బిష్‌కెక్‌లో జరుగనున్న షాంఘై కోఆపరేషన్ సదస్సులో ఇరు దేశాల ప్రధానులు సమావేశమయ్యే అవకాశం లేదని భారత్ ప్రకటించిన మరునాడే ఆయన లేఖ రాయడం గమనార్హం. రెండోసారి అధికారంలోకి రావడం పట్ల ప్రధాని మోదీకి ఇమ్రాన్ తన లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. మోదీ రెండో సారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఇమ్రాన్ చర్చలకు పిలుపునివ్వడం ఇది రెండోసారి. పుల్వామా తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. గత నెల 23న మోదీకి ఫోన్ చేసిన ఇమ్రాన్.. ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని కోరారు. విశ్వాసం, ఉగ్రవాద రహిత వాతావరణం కల్పిస్తేనే సాధ్యమని మోదీ తెలిపారు.

బాలాకోట్ బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో భారత్ ఒప్పందం

స్పైస్ 2000 గైడెడ్ బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో భారత వాయుసేన (ఐఏఎఫ్) రూ.300 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఫిబ్రవరి 26న పాక్‌లోని జైషే ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ వైమానిక దాడుల్లో వీటినే వినియోగించారు. అత్యవసర కొనుగోళ్లకు కేంద్రం కల్పించిన ప్రత్యేక ఆర్థిక అధికారాల కింద ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles