వీసాల్లేకుండా కర్తార్‌పూర్‌కు!

Fri,March 15, 2019 03:23 AM

India seeks visa free access for pilgrims to Kartarpur shrine

-వారంలో ఏడు రోజులూ అనుమతించాలి
-కాలి నడక భక్తులను సైతం రానివ్వాలి
-పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి భారత్ విజ్ఞప్తి
-కారిడార్ ఏర్పాటుపై సుహృద్భావ వాతావరణంలో తొలి భేటీ
-ఏప్రిల్ 2న తదుపరి సమావేశం

అటారీ/న్యూఢిల్లీ, మార్చి 14: పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను, భారత్ (పంజాబ్)లోని గురుదాస్‌పూర్ జిల్లాను కలుపుతూ కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ (కేఎస్సీ) ఏర్పాటుకు గురువారం ఇరు దేశాలు తొలి సమావేశాన్ని నిర్వహించాయి. కర్తార్‌పూర్‌లోని aచరిత్రాత్మక సిక్కు పుణ్యక్షేత్ర సందర్శన కోసం తొది దశలో రోజుకు 5 వేల మంది యాత్రికులను వీసాల్లేకుండా అనుమతించాలని భారత్ ఈ సమావేశంలో పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేసింది. ఎటువంటి విరామం లేకుండా వారంలో ఏడు రోజులూ గురుద్వారా సాహిబ్ దర్బార్‌ను సందర్శించేందుకు అనుమతించాలని, కాలి నడకన వెళ్లే భక్తులను సైతం ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు అనుమతించాలని పాక్ ప్రతినిధి బృందాన్ని గట్టిగా కోరినట్టు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ ఈ సమావేశానంతరం విలేకరులకు తెలిపారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, కేఎస్సీ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రమైన, నిర్మాణాత్మక చర్చలు జరుపడంతోపాటు ఈ ప్రాజెక్టు వేగవంతానికి కృషిచేయాలని అంగీకారానికి వచ్చినట్టు ఇరు పక్షాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

అటారీ-వాఘా సరిహద్దు వద్ద మన దేశంలో ఈ సమావేశం జరిగింది. కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగించుకుని గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించేలా యాత్రికులకు వీలుకల్పించే ముసాయిదా ఒప్పందం, సంబంధిత విధివిధానాలపై చర్చించేందుకు గురువారం అటారీలో నిర్వహించిన సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది అని ఆ ప్రకటన పేర్కొంది. తదుపరి సమావేశాన్ని వచ్చే నెల 2న వాఘాలో నిర్వహించాలని ఈ భేటీలో భారత్, పాక్ అంగీకారానికి వచ్చాయి. అంతకంటే ముందు కర్తార్‌పూర్ కారిడార్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు ఈ నెల 19న సాంకేతిక నిపుణుల సమావేశం జరుగుతుందని సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

ఖలిస్థాన్ నేత చావ్లాతో ఇమ్రాన్‌ఖాన్ భేటీ

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుధవారంనాడు ఖలిస్థాన్ అనుకూల నేత, జేఈఎం అధిపతి మసూద్ అజర్ అనుచరుడైన గోపాల్ సింగ్ చావ్లాతో భేటీ అయ్యారు. కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటు విధివిధానాలను ఖరారు చేసేందుకు అటారీలో భారత్, పాక్ అధికారులు సమావేశం కానున్న తరుణంలో ఇమ్రాన్ ఈ భేటీ నిర్వహించడం గమనార్హం. అంతకుముందు గోపాల్ సింగ్ చావ్లా పాక్ సైన్యాధిపతి జనరల్ కమర్ బజ్వాను కలుసుకున్నారు.

452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles