దాడులకు 2 గంటల ముందే..

Wed,April 24, 2019 12:59 AM

Indian officials who warned Sri Lanka

-శ్రీలంకను హెచ్చరించిన భారత అధికారులు
కొలంబో: శ్రీలంకలో ఆదివారం బాంబు దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే భారత ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులను హెచ్చరించారు. ఆదివారం ఉదయం శ్రీలంకలో తొలి ఆత్మాహుతి దాడి జరుగడానికి రెండు గంటల ముందు శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ అధికారులు సంప్రదింపులు జరిపారని, శ్రీలంకలోని కొన్ని చర్చిలకు ముప్పు ఉన్నదని భారత అధికారులు హెచ్చరించారని శ్రీలంక రక్షణ శాఖకు చెందిన అధికారితోపాటు భారతకు చెందిన మరో అధికారి వెల్లడించారు.

తొలి దాడి జరుగడానికి కొన్ని గంటల ముందు తమకు ఓ హెచ్చరిక వచ్చిందని శ్రీలంక రక్షణ శాఖకు చెందిన మరో అధికారి చెప్పారు. దాడుల విషయమై భారత అధికారులు శనివారం రాత్రి కూడా తమను హెచ్చరించినట్టు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 4వ తేదీతోపాటు 20వ తేదీన కూడా శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులకు ఇదేవిధమైన హెచ్చరికలను పంపినట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బాలిక తల నిమిరిన ఆత్మాహుతి బాంబర్
నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ఆదివారం దాడికి పాల్పడ్డ బాంబర్.. చర్చిలోకి ప్రవేశించడానికి కొన్ని సెకన్ల ముందు ఓ బాలిక తలను నిమిరాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మంగళవారం వెలుగులోకి వచ్చింది. గడ్డం పెంచుకుని భారీ బ్యాగ్ (బ్యాక్‌ప్యాక్)ను ధరించిన బాంబర్.. ఓ వయోజనుడితో కలిసి చర్చిలోకి వెళ్తున్న బాలిక తలపై చేయి వేసి నిమిరిన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తున్నది.

366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles