మాకు దూరంగా ఉండండి!

Mon,September 23, 2019 03:35 AM

అమెరికా దళాలకు ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ సూచన
టెహ్రాన్‌: గల్ఫ్‌లో విదేశీ సైన్యాలను మోహరించడంతో తమ ప్రజలు అభద్రతకు లోనవుతున్నారని, ఈ చర్యలు కొత్త సమస్యలను తీసుకొస్తాయని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ అన్నారు. సౌదీలో చమురు క్షేత్రాలపై దాడి తర్వాత పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్‌కు మరి న్ని సైనిక దళాలను పంపుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. దీనిపై ఆదివారం జరిగిన వార్షిక మిలిటరీ పరేడ్‌లో హసన్‌ రౌహానీ స్పందిస్తూ.. గల్ఫ్‌ లో శాంతి కోసం ఐరాసతో పాటు కృషి చేస్తామన్నారు. విదేశీ సైనిక దళాలు తమ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ‘మాకు దూరంగా ఉండండి. మీరు (విదేశీ సైనిక దళాలు) నిజాయతీగా ఉంటే, మా ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చాలనుకోకూడదు. మీరు మాకు దూరంగా ఉంటే, మేము మరింత భద్రతతో ఉంటాం’ అని చెప్పారు. పొరుగు దేశాలతో శాంతి సంబంధాలు నెలకొల్పడానికి ఇరాన్‌ ఓ ప్రణాళికను సిద్ధం చేసిందని, ఆ విషయాల్ని త్వరలోనే ఐరాసకు తెలియజేస్తామని రౌహానీ స్పష్టం చేశారు.

1428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles