టైగ్రిస్ నదిలో పడవ మునక..

Fri,March 22, 2019 03:14 AM

Iraq ferry sinking More than 71 dead in Tigris river

71 మంది మృతి ఇరాక్‌లో ఘోర ప్రమాదం
బాగ్దాద్/మోసుల్: కుర్దుష్ నూతన సంవత్సరం నౌరుజ్ వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. పడవ నీటిలో మునిగిపోవడంతో 71 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు. సాంకేతిక లోపం వల్లే పడవ మునిగిపోయినట్లు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇరాక్‌లోని మోసుల్ నగరానికి సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశానికి టైగ్రిస్ నది మీదుగా పడవలో వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 19 మంది పిల్లలతోపాటు 55 మందిని కాపాడామని ఇరాక్ ఆంతరంగిక వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ సాద్ మాన్ తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో చాలా మంది ప్రయాణిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్లే పడవ మునిగిపోయింది. నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది.

సమీపంలో ఎక్కువ బోట్లు లేకపోవడం వల్ల ప్రయాణికులందరినీ కాపాడలేకపోయాం అని నినెవేహ్ రాష్ట్ర ప్రజా రక్షణ విభాగం అధిపతి కల్నల్ హుస్సమ్ ఖలీల్ చెప్పారు. ఈ ఘటన గురించి తెలియగానే ఆరోగ్య శాఖ సిబ్బందిని ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దెల్ మహ్దీ అప్రమత్తం చేశారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పడవలో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని ప్రమాదం నుంచి బయటపడిన ఒక యువకుడు పేర్కొన్నాడు. పడవ మునుగుతున్న సంగతి గమనించిన పలువురు ఇతరులను కాపాడేందుకు నదిలోకి దూకేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో మోసుల్ డ్యామ్ నుంచి దిగువకు భారీగా నీరు విడుదల చేశారు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles