రష్యాలో కిమ్ పర్యటన

Thu,April 25, 2019 01:54 AM

Kim Jong un arrives in Vladivostok by train for Putin summit

-పుతిన్‌తో చర్చలు జరుపనున్న
-ఉత్తరకొరియా అధినేత
వ్లాదివోస్తాక్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర చర్చల కోసం ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బుధవారం రష్యాకు చేరుకున్నారు. ప్రత్యేక రైలులో రైలులో ప్రతినిధి బృందంతో బయలుదేరిన కిమ్, బుధవారం మధ్యాహ్నం వ్లాదివోస్తాక్‌లోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హానోయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మలి విడుత శిఖరాగ్ర చర్చలు విఫలమైన తర్వాత పుతిన్‌తో కిమ్ ముఖాముఖీ భేటీ కానుండటం ఇదే తొలిసారి. అణ్వస్ర్తాల ధ్వంసం విషయమై అమెరికాతో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరుల మద్దతును కిమ్ కూడగట్టనున్నారు. జానపద కళాకారిణులు రైల్వేస్టేషన్‌లో కిమ్‌కు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రతా బలగాల నుంచి కిమ్ గౌరవ వందనం స్వీకరించారు. రష్యాకు చెందిన ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తన పర్యటన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్న పుతిన్.. కిమ్‌తో చర్చల కోసం గురువారం వ్లాదివోస్తాక్‌కు రానున్నారు.

319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles