అమెరికా పెత్తనానికి అడ్డుకట్ట

Fri,April 26, 2019 04:17 AM

Kim Jong Un needs international security guarantees to give up nuclear arsenal

-సన్నిహిత సంబంధాల పెంపుదలకు పుతిన్, కిమ్ నిర్ణయం
-పటిష్ఠమైన దౌత్య, ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్యలు

వ్లాదివోస్తాక్, ఏప్రిల్ 25: అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా పెత్తనానికి అడ్డుకట్ట వేసేందుకు ఇరుదేశాలు సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు, అణు యుద్ధాల నివారణకు చేపట్టే చర్యలకు రష్యా మద్దతునిస్తుందని అయితే ఉత్తరకొరియా భద్రతకు, సార్వభౌమత్వానికి గ్యారంటీలు అవసరమని నొక్కి చెప్పారు. అణ్వస్ర్తాల విషయమై అమెరికాతో ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో గురువారం వ్లాదివోస్తాక్‌లో పుతిన్, కిమ్ మధ్య చర్చలు జరిగాయి. సమావేశం తర్వాత పుతిన్ మాట్లాడుతూ రహస్యాలేమీ లేవు. కుట్రలు లేవు. తన పరిస్థితిని అమెరికాకు వివరించాలని ఉత్తరకొరియా చైర్మన్ కిమ్ నన్ను కోరారు అని తెలిపారు. కిమ్ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక పరంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహద పడుతుందని చెప్పారు. కిమ్ మాట్లాడుతూ తమ మధ్య చాలా అర్థవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles