న్యూజిలాండ్ ప్రధానికి చిన్నారి లంచం!

Wed,May 15, 2019 01:30 AM

New Zealand PM Jacinda Ardern Returns 11 Year Old Girls Bribe For Research on Dragon

- డ్రాగన్లపై పరిశోధనలు జరుపాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ
- డబ్బును తిరిగి పంపిన ప్రధాని


వెల్లింగ్టన్: డ్రాగన్లపై పరిశోధనలు జరుపాలని కోరుతూ పదకొండేండ్ల బాలిక న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్‌కు 5 న్యూజిలాండ్ డాలర్లను లంచంగా ఇచ్చింది! అయితే ప్రధాని ఆ డబ్బును తిరిగి ఆ చిన్నారికి పంపారు. న్యూజిలాండ్‌కు చెందిన విక్టోరియా అనే బాలిక డ్రాగన్లపై ఆసక్తి పెంచుకుంది. టైలికైనెటిక్ పవర్స్ ద్వారా డ్రాగన్లకు శిక్షకురాలిగా మారాలని భావించింది. ఇందుకోసం టెలీ కైనెటిక్స్, డ్రాగన్లపై పరిశోధనలు జరుపాలని ఆ దేశ ప్రధానికి లేఖ రాసింది. అలాగే 5 న్యూజిలాండ్ డాలర్లను లంచంగా పంపింది. ఆ చిన్నారి లేఖకు స్పందించిన ప్రధాని.. ఆ బాలికకు తిరిగి లేఖ రాశారు. ఫిజిక్స్, డ్రాగన్ల విషయంలో నీ సూచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం మేం ఈ విభాగాల్లో ఎలాంటి పరిశోధనలు చేయడం లేదు. కాబట్టి నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి పంపుతున్నా. టెలీకినెసిస్, టెలీపతి, డ్రాగన్ల అన్వేషణలో నీ ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నాను అని ప్రధాని అందులో పేర్కొన్నారు. పీ.ఎస్. డ్రాగన్లపై నేను ఓ కన్నేసి ఉంచుతాను. ఇంతకూ డ్రాగన్లు సూట్ వేసుకుంటాయా? అని సరదాగా ప్రశ్నించారు.

1161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles