స్పీకర్..ఆయా..

Fri,August 23, 2019 01:58 AM

New Zealand speaker feeds lawmaker baby in Parliament

- మహిళా ఎంపీ చిన్నారికి పాలుపట్టిన న్యూజిలాండ్ స్పీకర్
న్యూజిలాండ్, ఆగస్టు 22: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో అరుదైన ఘటన జరిగింది. బుధవారం సమావేశాలకు తమాటి కాఫే అనే ఎంపీ నెల రోజుల వయసున్న తన కుమారుడిని తీసుకొని వచ్చారు. ఆమె మాట్లాడుతుండగా బాలుడు ఏడుపు మొదలుపెట్టాడు. దీం తో స్పీకర్ ట్రీవర్ మల్లార్డ్ ఆ బాలుడిని త న వద్దకు రప్పించుకుని పాలుపట్టి ఆయాలాగా సముదాయించారు. ఈ ఫొటోను స్పీకర్ ట్వీట్ చేశారు. సాధారణంగా స్పీకర్ కుర్చీలో సభకు అధ్యక్షత వహించే వారు కూర్చుంటారు. కానీ ఈ రోజు నాతోపాటు ఓ వీఐపీ కూడా కూర్చున్నాడు. మీ ఇంటిలోకి కొత్త వ్యక్తి వచ్చినందుకు ఎంపీ తమాటి కాఫేకి అభినందనలు అని స్పీకర్ పేర్కొన్నారు.

669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles