కశ్మీర్‌పై మా విధానం మారదు

Sat,August 10, 2019 02:47 AM

No policy change on Kashmir says U S

-మళ్లీ స్పష్టం చేసిన అమెరికా
-జోక్యానికి నిరాకరించిన చైనా

వాషింగ్టన్: కశ్మీర్‌పై తమ విధానంలో ఏ మార్పులేదని అమెరికా పునరుద్ఘాటించింది. ఇటీవలి పరిణామాలపై భారత్-పాక్ సంయమనం పాటించాలని, ప్రత్యక్ష చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. కశ్మీర్ పూర్తి గా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని అమెరికా అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ గురువారం తెలిపారు. కశ్మీర్‌పై ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించు కునేందుకు అమెరికా పూర్తి మద్దతుని స్తుందన్నారు. అమెరికా ప్రతినిధి ఒకరు వచ్చేవారం భారత్‌లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో పరిస్థితులను తాము గమనిస్తున్నామ న్నారు. భారత్-పాక్‌తో అమెరికాకు బలమైన సంబంధాలున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవలి అమెరికా పర్యటన కేవలం కశ్మీర్ ప్రాధాన్యంగా సాగలేదు. ఇతర అంశాలపై నా మేం చర్చిం చాం. మాకు భారత్‌తో ఉన్నట్టే పాక్‌తో కూడా సత్సంబంధాలున్నాయి అని అన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న నివేదికలపై నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అధికరణం 370 రదుపై భారత్ తమకు ముందే సమాచారం ఇచ్చిందన్న వార్తల్ని ఓర్టగస్ మరోసారి కొట్టివేశారు.

సామరస్యంగా చర్చించుకోండి: చైనా

కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై తమకు మద్దతుగా నిలవాలని చైనాను పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి కోరారు. కశ్మీర్‌పై జోక్యానికి చైనా నిరాకరించింది. ఈ సమస్యను భారత్-పాక్ సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకుని శాంతి, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

సిమ్లా ఒప్పందాన్ని గుర్తుచేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి

కశ్మీర్‌పై భారత్-పాక్ మధ్య 1972 నాటి సిమ్లా ఒప్పందం ఉన్నదని పాక్ కు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ గుర్తుచేశారు. కశ్మీర్ అంశాన్ని ఇటీవల తన దృష్టికి తీసుకెళ్లిన పాక్‌తో గుటేరస్ పై విధంగా అన్నారు. కశ్మీర్ భారత్- పాక్ ద్వైపాక్షిక సమస్య. దాన్ని శాంతియుత చర్చలతో పరిష్కరించుకోవాలి. మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదు అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై ఐరాసకి పాకిస్థాన్ రాసిన లేఖపై స్పందించేందుకు ఐరాస భద్రతా మండలి చీఫ్ జోవన్నా వ్రోనెక్కా నిరాకరించారు.

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles