ఉత్తర కొరియా మరో ఆయుధ పరీక్ష

Mon,August 26, 2019 01:45 AM

North Korea tests new super large rocket launcher

-విజయవంతంగా సూపర్‌ లార్జ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ ప్రయోగం
సియోల్‌: క్షిపణి పరీక్షనో, మారణాయుధ పరీక్షలో చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా.. మరో హాట్‌ టాపిక్‌తో వార్తల్లోకెక్కింది. శనివారం సూపర్‌ లార్జ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వీయ పర్యవేక్షణలో మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ ప్రయోగం, కిమ్‌ ఫొటోల ను, క్షిపణుల వద్ద నిలబడి ఉన్న ఫొటోలను ఉత్తర కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ ‘ఉత్తర కొరియాకివి విలువైన సంప ద’ అని అన్నారు. ‘నిరంతర బెదిరింపులు, శత్రు శక్తుల ఒత్తిడి దాడులను నిరాశపరిచేందుకు కొరియా తరహా వ్యూహాత్మక ఆయుధాల అభివృద్ధిని కొనసాగిస్తాం’ అని అన్నారు. అమెరికా, దక్షిణ కొరియా చేపట్టిన సాధారణ సైనిక కసరత్తులకు ప్రతిస్పందనగా క్షిపణి, రాకెట్‌లను పరీక్షించినట్లు ఉత్తర కొరి యా తెలిపింది. కాగా, ఉత్తర కొరియా చర్య తనకు సంతోషంగా లేదని ట్రంప్‌ అన్నారు. అయినా కిమ్‌ నిబంధనలను ఉల్లంఘించలేదన్నారు.

663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles