మానవ చర్యల కారణంగా..

Wed,April 24, 2019 02:23 AM

One million species risk extinction due to humans

-10 లక్షల జీవజాతుల మనుగడకు ముప్పు
-ఐక్యరాజ్యసమితి ముసాయిదా నివేదికలో వెల్లడి

పారిస్, ఏప్రిల్ 23: మానవ చర్యల కారణంగా సుమారు 10 లక్షల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ముసాయిదా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. తన మనుగడకు ప్రాణాధారమైన ప్రకృతి వనరుల పట్ల మనిషి వహిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నివేదిక ఎత్తిచూపింది. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, కార్బన్‌డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులు, పరాగసంపర్క కీటకాలు, తుపాన్లను నిలువరించే మడ అడవులు వంటివి వేగంగా తగ్గిపోతుండడం వాతావరణ మార్పులకు ఏమాత్రం తక్కువ కాకుండా ముప్పును కలుగజేస్తున్నాయని తెలిపింది. మే 6న ఈ నివేదిక విడుదల కానుంది. ఈనెల 29న 130 దేశాలకు చెందిన ప్రతినిధులు పారిస్‌లో సమావేశమై ఈ నివేదికపై చర్చించనున్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి నష్టం.. రెండూ ముఖ్యమైనవేనని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కేవలం పర్యావరణానికే కాదు.. ఆర్థికాభివృద్ధికి కూడా అని ఈ నివేదికను రూపొందించిన ఐక్యరాజ్యసమితి విభాగానికి చైర్మన్ అయిన రాబర్ట్ వాట్సన్ వ్యాఖ్యానించారు.

351
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles