ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులోకి ‘చెడ్డీ’

Fri,March 22, 2019 03:12 AM

Oxford dictionary adds chuddies to list

650 కొత్త పదబంధాలతో డిక్షనరీ అప్‌డేట్
లండన్, మార్చి 21: భారతీయ పదం చెడ్డీస్‌కి ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు (డిక్షనరీ)లో తాజాగా చోటు లభించింది. ఈ నెలలో ఆక్స్‌ఫర్డ్ నిఘంటువును అప్‌డేట్ చేసి ఈ పదాన్ని చేర్చారు. భారత ఉపఖండం నుంచి ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు (ఓఈడీ)లో చేర్చిన అనేక పదాల్లో ఇది ఒకటి. బ్రిటీష్ పాలనలోనే అనేక ప్రచురణలు, గెజిట్లలో చెడ్డీకి చోటు లభించింది. అయితే 90వ దశకం మధ్య బీబీసీ టెలివిజన్‌లో ప్రసారమై ఎంతో ప్రజాదరణ పొందిన బ్రిటీష్-ఏషియన్ కామెడీ సిరీస్ గుడ్‌నెస్ గ్రేషియస్ మీలో ఉపయోగించిన తర్వాత ఈ పదం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. చెడ్డీస్ అనే పదాన్ని తమ నిఘంటువులో చేర్చుతున్నట్టు ఓఈడీ సీనియర్ అసిస్టెంట్ జొనాథన్ డెంట్ వెల్లడించారు. ఆ డిక్షనరీలో ఈ పదానికి షార్ట్స్, షార్ట్ ట్రౌజర్స్ అనే అర్థాలను ఇచ్చారు. చెడ్డీస్ అనే పదాన్ని 1858లో బ్లాక్‌వుడ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్ పత్రికలో తొలిసారి వాడినట్టు ఈ నిఘంటువు పేర్కొన్నది. ఈ నెలలో 650 కొత్త పదబంధాలను చేర్చి ఈ డిక్షనరీని అప్‌డేట్ చేశారు. ఎంతో కాలంగా ఈ నిఘంటువులో భారతీయ మూలాలున్న అనేక పదాలను చేర్చారు. వాటిలో లూట్, బంగ్లా, అవతార్, మంత్ర, చట్నీ, కాట్, డెకాయిట్, జుగర్‌నాట్, గురు, పండిట్, జంగిల్, నిర్వాణా, పక్కా, పైజమాస్, వరండా, మహరాజ్, పంచ్ తదితర పదాలున్నాయి.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles