గగనతలాన్ని వాడుకోనివ్వం!

Sun,September 8, 2019 01:05 AM

Pakistan denied Indian President Ram Nath Kovinds plane to enter in his airspace

- రాష్ట్రపతి కోవింద్‌ విదేశీ పర్యటనపై భారత్‌ విజ్ఞప్తికి పాక్‌ నిరాకరణ

ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 7: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విదేశీ పర్యటన కోసం తమ గగనతలాన్ని వినియోగించుకొనేందుకు పాకిస్థాన్‌ నిరాకరించింది. ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్‌, స్లొవేనియా దేశాల్లో రాష్ట్రపతి కోవింద్‌ మూడురోజుల పర్యటన సోమవారం నుంచి మొదలుకానున్నది. తన పర్యటనలో భాగంగా ఆయాదేశాల ముఖ్యనేతలతో రాష్ట్రపతి భేటీకానున్నారు. పుల్వామా దాడిసహా ఇటీవల దేశంలో పెరిగిన ఉగ్రవాద ఘటనలను వారిదృష్టికి కోవింద్‌ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి కోవింద్‌ ప్రయాణించే విమానం పాక్‌ గగనతలం మీదుగా ఐస్‌ల్యాండ్‌ వెళ్లేందుకు అనుమతించాలని భారత్‌చేసిన విజ్ఞప్తిని తమ ప్రభుత్వం తోసిపుచ్చినట్టు పాక్‌ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషి శనివారం మీడియాకు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ గగనతలాన్ని భారత్‌ వినియోగించుకొనే అవకాశం ఇవ్వరాదనే నిర్ణయానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, దీనికి ప్రతిగా బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు చేయడంతో గత ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. జూలై 16న గగనతలాన్ని తెరిచినప్పటికీ భారత విమానాలపై మాత్రం నిషేధాన్ని అమలుచేస్తున్నది.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles