దక్షిణాసియాలో శాంతి బాధ్యత పాకిస్థాన్‌దే!

Sun,June 9, 2019 01:20 AM

Pakistan responsibility for peace in South Asia

-అమెరికా స్పష్టీకరణ
వాషింగ్టన్, జూన్ 8: ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకట్ట వేస్తూ.. దక్షిణాసియాలో సుస్థిర శాంతి స్థాపన బాధ్యత పాకిస్థాన్‌దేనని అమెరికా స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధానికి రాసిన రెండో లేఖలో.. కశ్మీరుతో సహా అన్ని విభేదాలను పరిష్కరించుకోవడానికి చర్చల ప్రస్తావన తీసుకురావడంతో అమెరికా పైవిధంగా స్పందించింది. ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించకుండా పాకిస్థాన్ చర్యలు చేపట్టాలని, ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడకుండా పాక్ చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాగా ఈ నెల 13, 14 తేదీల్లో కిర్గిజ్‌స్థాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత్, పాక్ ప్రధానులు పాల్గొననున్నారు. అయినా వారి మధ్య చర్చలు జరగడంలేదు.

419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles