జాదవ్ వ్యాపారి కాదు.. గూఢచారి

Wed,February 20, 2019 01:06 AM

Pakistan substitutes legal speak with jibes on day one of its oral arguments at ICJ

-భారత్ పిటిషన్‌ను కొట్టివేయండి
-పెషావర్‌లో విద్యార్థుల మారణహోమం భారత్ పనే
-బలూచిస్థాన్, సింధ్‌లో కూడా దాడులకు ప్రయత్నించింది
-ఐసీజేలో పాక్ ఆరోపణలు

హేగ్: కుల్‌భూషణ్ జాదవ్ వ్యాపారి కాదని, ఓ గూఢచారి అని, అతనికి విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలన్న భారత్ విజ్ఞప్తిని కొట్టివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను పాకిస్థాన్ కోరింది. ఐసీజేను భారత్ రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్నదని ఆరోపించింది. భారత నౌకాదళ మాజీ అధికారి జాదవ్‌కు కుట్ర, ఉగ్రవాదం అభియోగాలపై పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై ఐసీజేలో వరుసగా రెండోరోజు విచారణ జరిగింది. తొలిరోజు భారత్ వాదించగా, రెండో రోజు మంగళవారం పాకిస్థాన్ తరఫున ఆ దేశ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ వాదించారు. జాదవ్ భారత నౌకాదళంలో ఇప్పటికీ ఉద్యోగియేనని అతడు గూఢచారిగా భారత పాస్‌పోర్టుపై ఓ ముస్లిం పేరుతో పాక్‌లో ప్రవేశించాడని తెలిపారు. పాక్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటున్నదని, బలూచిస్థాన్, సింధ్‌తోపాటు పాక్‌లోని పలు ప్రాంతాలలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. భారత ప్రభుత్వ సూచనల మేరకే పథకంతో జాదవ్ పాకిస్థాన్‌లో ప్రవేశించినట్లు ఓ మేజిస్ట్రేట్ ముందు అంగీకరించాడని చెప్పారు. పెషావర్ స్కూల్‌పై ఉగ్రదాడిలో భారత్ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఐసీజే ఎదుట తీవ్ర ఆరోపణలు చేసింది. కాగా ఐసీజే ధర్మాసనం సభ్యుడు, పాక్ తాత్కాలిక న్యాయమూర్తి హుస్సేన్ గిలానీ గుండెపోటు చికిత్స పొందుతున్నందున కేసు విచారణను వాయిదా వేయాలన్న పాక్ అభ్యర్థనను ఐసీజే నిరాకరించింది.

743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles