స్మార్ట్ వెపన్‌ను పరీక్షించిన పాక్

Wed,March 13, 2019 01:54 AM

Pakistan successfully test fires extended range missile from JF 17 Thunder

-పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు వెల్లడి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్ మంగళవారం జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానం నుంచి విస్తృత శ్రేణి స్మార్ట్ వెపన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. దీని ద్వారా అత్యంత కచ్చితత్వంతో విభిన్న లక్ష్యాలను ఛేదించగల సత్తా జేఎఫ్-17 సొంతమైందని తెలిపింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ వెపన్‌ను తయారు చేసినట్లు పాకిస్థాన్ వాయుసేన (పీఏఎఫ్) వెల్లడించింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల పాక్ చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్ ఆ దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించారు. పాకిస్థాన్ శాంతికాముక దేశం. ఒకవేళ పాక్‌పై ఎవరైనా దురాక్రమణకు దిగితే.. పూర్తి స్థాయిలో బదులిస్తాం అని ఆయన పేర్కొన్నారు.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles