ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య రాకెట్ల దాడి

Sun,September 8, 2019 01:00 AM

Palestinian rocket attacks on Israel

- ఇజ్రాయెల్‌ మీదకు రాకెట్లను ప్రయోగించిన పాలస్తీనా
- ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌


జెరూసలేం, సెప్టెంబర్‌ 7: చిరకాల ప్రత్యర్థులైన ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఇజ్రాయెల్‌ మీదకు పాలస్తీనా రాకెట్లతో దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనా యువకులు మరణించారు. అనంతరం ఇజ్రాయెల్‌ దళాలు పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతంపై దాడులు జరిపాయి. ప్రధానంగా సైనిక పోస్టులు, బలగాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని పాలస్తీనా ప్రకటించింది. కానీ సరిహద్దులో శుక్రవారం జరిగిన కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. 46 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్‌ సైన్యం స్పందిస్తూ శనివారం గాజా ప్రాంతం నుంచి తమ గగనతలంలోకి ఓ డ్రోన్‌ కూడా ప్రవేశించిందని తెలిపింది. ఈ డ్రోన్‌ ఓ పేలుడు పదార్థాన్ని జార విడిచిందని, దీంతో సైనిక వాహనం ధ్వంసమైందని పేర్కొంది. డ్రోన్‌ను ప్రయోగించిన బృందంపై దాడి చేశామని, మరణించిన వారి వివరాలు తెలియరాలేదని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles